తెలంగాణ

విద్యా రంగానికి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: విద్యారంగానికి ఈ సారి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. విద్యారంగం అభివృద్ధి చెందితేనే పిల్లలకు సుస్థిర భవిష్యత్, తద్వారా సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందనే భావనతో ఈసారి విద్యారంగానికి పెద్ద పీట వేసింది. కేవలం పాఠశాల విద్యకు 10,830 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యా రంగానికి 2448 కోట్లు కేటాయించింది. రెసిడెన్షియల్ విద్యకు 2823 కోట్లు ప్రతిపాదించింది. వీటికి తోడు ఓవర్సీస్ విద్యకు, విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం అందించేందుకు వేరుగా నిధులను కేటాయించింది. రాష్ట్రంలో 41,337 పాఠశాలలు ఉండగా, అందులో 58,66,786 మంది విద్యార్ధులున్నారు. వీరందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో పక్క ఈ ఏడాది పాఠశాలలు తెరిచే నాటికి 8792 మంది టీచర్లను నియమించబోతున్నట్టు ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సర్వశిక్షా అభియాన్ పథకం కింద గత మూడు సంవత్సరాల్లో పాఠశాలల్లో వౌలిక వసతుల కోసం 44,588 పనులు చేపట్టామని, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వసతుల మెరుగు కు 92.30 కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లకు ప్రహరీ గోడలకు 78 కోట్లు ఖర్చుచేస్తున్నామని ఆర్ధిక మంత్రి తన బడ్జెట్ వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యం, వారానికి మూడు రోజులు గుడ్లు లేదా అరటిపండు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఉన్నత విద్యలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతుల మెరుగుకు ఇంత వరకూ 259 కోట్లు ఖర్చు చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లకు భృతిని కూడా పెంచామని ఆర్ధిక మంత్రి తెలిపారు. సాంకేతిక విద్య కింద కొత్తగా 11 పాలిటెక్నిక్‌లను ప్రారంభిస్తున్నామని, వీటికి 95 కోట్లు కేటాయించామని అన్నారు.