జాతీయ వార్తలు

కేంద్ర మంత్రులు ఏడుగురు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్‌లతో సహా ఏడుగురు కేంద్ర మంత్రులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్చి 23న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి రంగంలో ఉన్నారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్‌లు తమ స్వరాష్ట్రాలైన బిహార్, మహారాష్టల్రనుంచి ఎన్నికయ్యారు. కాగా పెట్రోలియం శాఖ మంది ధర్మేంద్రప్రదాన్, సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ధవార్ చంద్ గెహ్లాట్‌లు మధ్యప్రదేశ్‌నుంచి రాజ్యసభలో స్థానం సంపాదించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా ఎన్నిక ఏకగ్రీవం కాగా, మరో ఇద్దరు కేంద్రమంత్రులు పురుషోత్తం రూపలా, మనసుఖ్ మాండవియలు కూడా గుజరాత్‌నుంచి ఏవిధమైన పోటీలేకుండా ఎన్నికయ్యారు. రాజ్యసభకు ప్రధాన పార్టీలకు చెందిన అధికారిక నామినీలు ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రాలు వరుసగా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలనుంచి ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైన స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాజ్యసభకు ద్వైవార్షికంగా జరిగే ఎన్నికల్లో మొత్తం 16 రాష్ట్రాలకు చెందిన 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో ఒకస్థానానికి, ఉత్తరప్రదేశ్‌లో 10 స్థానాలకు గాను 11 మంది పోటీలో ఉన్నారు. వీటిల్లో భాజపా నుంచి అరుణ్ జైట్లీ, సమాజ్‌వాదీ పార్టీ నుంచి జయాబచ్చన్ రంగలో ఉన్నారు. ఈ మొత్తం పది సీట్లలో 8 సీట్లను భాజపా ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. కాగా ఛత్తీస్‌గఢ్ నుంచి ఉన్న ఒకే స్థానానికి భాజపా, కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయి. తెలంగాణకు సంబంధించి నలుగురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ముగ్గురిని, కాంగ్రెస్ ఒకరిని బరిలోకి దించాయి. ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ అభ్యర్థులు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. గుజరాత్ నుంచి ఇద్దరు భాజపా, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు.

ఏపీనుంచి ముగ్గురు
అమరావతి: రాజ్యసభకు రాష్ట్రం నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ లేనందున ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి చింతకుంట రమేష్ మునయ్య (సీఎం రమేష్), కనకమేడల రవీందర్, వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సత్యనారాయణ తన ప్రకటనలో తెలిపారు.
దేశంలో ప్రతిభ గలవారికి కొదవలేదు. కళాకారులతోపాటు కార్మికులు కూడా తమకు అబ్బిన నైపుణ్యంతో అబ్బురపరచే ఆవిష్కరణలను సృష్టించగలరు. చేనేత చీరను మడిచి అగ్గిపెట్టెలో పెట్టిన దృశ్యాల్ని మనం చూశాం. అలాంటిదే ఈ ‘దబ్బనంలో దూరే చీర’. వేములవాడకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ తన ప్రతిభతో అమ్మవారి కోసం దబ్బనంలో దూరే చీరను నేసి గురువారం శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో రాజేశ్వర్‌కు అందజేశారు.