మెదక్

3వేల ఎకరాలు భూమి పంపిణీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 15: ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లాకు వెయ్యి ఎకరాల చొప్పున దళితులకు 3వేల ఎకరాలు పంపిణీ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. గురువారం అసెంబ్లీ హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలపై డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందరెడ్డితో కలసి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జిల్లాకు వెయ్యి ఎకరాల చొప్పున 3వేల ఎకరాలు దళితుల భూ పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే చెపట్టాలని అధికారులకు సూచించారు. శాసన సభ్యులు ప్రతిపాదించిన భూమికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూ పంపిణీ కార్యక్రమంలో విమర్శలు లేకుండ జాగ్రత్తగా వ్యవహరించాలని మూడు జిల్లాల కలెక్టర్లు, శాసన సభ్యులు, అధికారులను మంత్రి కోరారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరుగాలని, సాగుకు యోగ్యమైన భూములను మూడు ఎకరాల చొప్పున దళితులకు పంపిణీ చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా నర్సాపూర్, నారాయణఖేడ్, తుప్రాన్, రామాయంపేట, చేర్యాలలు మున్సిపాల్టీలుగా ఏర్పటు కానున్నాయని మంత్రి తెలిపారు. కొత్తగా ఏర్పాటు కానున్న మున్సిపాల్టీలకు స్టార్టప్ నిధులున్నాయని, వాటితో అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఏ మున్సిపాల్టీలో ఏ గ్రామాలను విలీనం చేస్తున్నారో రెండు రోజుల్లో తెలియజేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. విలీనం సందర్భంగా ప్రజల నుండి వ్యతిరేకత లేకుండ చూడాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో గ్రామపంచాయతీ చట్టసవరణ బిల్లును ఆమోదించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజక వర్గం అభివృద్ధి (ఏసీడీపి) నిధులను వెంటనే ఖర్చుచేయాలని ఆదేశించారు. పలు నియోజక వర్గాల్లో ఈ నిధులు ఖర్చుకావటం లేదని, దీంతో ప్రజల్లో సంబధిత శాసన సభ్యులపై అసంతృప్తి నెలకొంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈనెలాఖరులోపు ఏసీడీపీ కింద నిధులు ఖర్చు చేసే విధంగా పనులు మంజూరు చేసి వాటిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలను మంత్రి హరీష్‌రావు కోరారు. ప్రతి పురపాలక సంఘానికి ఒక స్పెషల్ అధికారిని నియమించి అభివృద్ధి పనులు యుద్ధ ప్రతిపాధికన పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, తెల్లవారు జామున పాదయాత్ర చేసి ప్రజాసమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని కోరారు. ప్రతి మున్సిపాల్టీకి ఒక రైతు బజారు మంజూరు చేశామని, అయితే నాలుగైదు చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, కొన్ని చోట్ల అసలే పనులు ప్రారంభించలేదన్నారు. సత్వరమే రైతుబజార్ నిర్మాణ పనులన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి మున్సిపాల్టీలో వైకుంఠదామం ఏర్పాటు చేయాలని, ఇందుకు గాను స్వచ్ఛంద సంస్ధలు దాతలు ఇతర మార్గాల్లో నిధులు సమకూర్చుకొని వాటిని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. వైకుంఠరథాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సిద్దిపేటలో వైకుంఠదామాన్ని మోడల్‌గా తీసుకొని నిర్మించాలని కోరారు. వచ్చే ఆరునెలల్లోపు మున్సిపాల్టీల రూపురేఖలు మారిపోవాలని మంత్రి కోరారు. అన్ని మున్సిపాల్టీలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో 12 దేవాలయాలకు పాలక మండలి ఏర్పాటు కాలేదని, వెంటనే అయాకమిటీలను నియమించాలని సూచించారు. జిల్లాలో మహిళ భవనాలు, గ్రామాల్లో మహిళ భవనాలు నిర్మించాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ పనులపై సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రికరించాలని, ఉమ్మడి మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పురోగతిపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌డబ్లుఎస్ అధికారులు ఏజెన్సీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు జిల్లాలో డబుల్ బెడ్ రూంల నిర్మాణ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు. డబుల్ బెడ్ రూం మిషన్ భగీరధ పనులను ప్రతి వారం ఒక రోజు ప్రత్యేంగా సమీక్షించాలని కోరారు. చేనేత కార్మికుల రుణమాఫీని మంత్రి హరీష్‌రావు సమీక్షిస్తు 2011 వరకు మాత్రమే నేత కార్మికులకు సర్కార్ రుణమాఫీ చేసిందని, 2014 వరకు ఉన్న కార్మికుల రుణాలన్ని మాఫీ చేసేందుకు నిర్ణయించినందున లబ్ధిదారులు జాబీతా సిద్ధం చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఈసమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబుమోహన్, మదన్‌రెడ్డి, చింత ప్రభాకర్, గూడేం మహిపాల్‌రెడ్డి, సతీష్‌బాబు ఎమ్మెల్సీలు ఫరిదోద్దీన్, భూపాల్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు వెంకట్రామ్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, గడా అధికారి హన్మంత్‌రావు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 15లోగా మిషన్ భగీరథ నీరందించండి
*శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, మార్చి 15: ఏప్రిల్ 15 వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బల్క్ నీరు అందించాలని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఉపసభాపతి ఛాంబర్‌లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా పనులు జరగాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెదక్ పట్టణం, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంచినీటిని అందించాలని ఆర్ డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. రెండు పడకల గదుల నిర్మాణం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నర్సాపూర్, అందోల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, బాబుమోహన్, భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.