శ్రీకాకుళం

పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, మార్చి 16: వేసవి ప్రారంభమైనప్పటికీ ప్రతీ రోజూ ఉదయం ఎనిమిది గంటల వరకూ పొగమంచు విపరీతంగా కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మంచును తేనేమంచు అని కూడా పిలుస్తారు. రహదారులు కన్పించకపోవడం వల్ల ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదే విధంగా తేనే మంచువల్ల మామిడి కాపు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ఏడాది అంతంతమాత్రంగా ఉన్న మామిడి పంట తేనేమంచువల్ల కాయలపై మచ్చలు ఏర్పడి నల్లగా మాడిపోతున్నాయి. తేనే మంచు ప్రభావంతో మామిడికాయలకు క్రిమికీటకాదులు చేరే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉండగా, రబీలో సాగుచేస్తున్న పెసర, మినుముతోపాటు మిరపపంట కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఈ మంచువల్ల ఉంది.

రేషన్ డిపోలు తెరవకపోతే జరీమానాలు
తహశీల్థార్ రామారావు
నరసన్నపేట, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు నిత్యవసర సరుకులను అందించేందుకుగాను అమలుచేస్తున్న రేషన్ డిపోలను తెరవకపోతే భారీ జరీమానాలు విధించడం తప్పదని తహశీల్థార్ జె.రామారావు తెలిపారు. శుక్రవారం తహశీల్థార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేషన్ డిపోల డీలర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి తప్పనిసరిగా ప్రభుత్వం నియమనిబంధనల మేరకు రేషన్ డిపోలను తెరిచివుంచాలని సమయపాలన పాటించాలని లేనిపక్షంలో ఒక రోజుకు రూ. 500 జరీమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేసారు. ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ సరుకులను లబ్దిదారులకు అందజేయాలని వ్యాధిగ్రస్తులకు నేరుగా గ్రామరెవెన్యూ అధికారుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సి.ఎస్.డి.టి. శ్రీనివాసరావు, డీలర్లు పాల్గొన్నారు.