శ్రీకాకుళం

జిఎస్టీ టాలీపై ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 16: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల నిరుద్యోగ యువతీయువకులకు మెప్మా ఆధ్వర్యంలో జి ఎస్‌టి బెస్ట్ అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ కంప్యూటర్ కోర్సుపై కాశీబుగ్గ తిలక్‌నగర్‌లో ఉన్న చరిత కంప్యూటర్స్‌లో ఉచిత శిక్షణ జరుగుతుందని కమిషనర్ ఎన్.రమేష్‌నాయుడు తెలిపారు. ఆసక్తి యువతీయువకులు 18 నుంచి 40 సంవత్సరాలోపు కలిగి మున్సిపాలిటీ పరిధి వారు, 10వ తరగతి, ఇంటర్ అర్హత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు, విద్యార్హతలు, ఆధార్‌కార్డు, కులదృవీకరణపత్రాలు రెండు ఫోటోలతో 8074025714 నెంబరును సంప్రదించాలన్నారు.

హెచ్చరిక బోర్డులు జారీ చేసిన కమిషనర్
రాజాం, మార్చి 16: రాజాం బస్ కాంప్లెక్స్ ప్రాంతంలోని వివాదాస్పద స్థలంలో రాజాం నగర పంచాయతీ కమిషనర్ బి.వి.రమణ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. 1649/1954 సంవత్సరానికి సంబంధించి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ స్థలంపై గత రెండు నెలలుగా ఇరువర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండడం విదితమే. దీనిపై స్థానిక తహశీల్దార్ దర్యాప్తు జరిపి ఈ స్థలం నగర పంచాయతీదిగా తేల్చారు. దీనిపై కమిషనర్ తూర్పున గుర్రప్ప చెరువు, పడమర ఆర్‌అండ్‌బి గోడ, ఉత్తరాన జిరాయితీ భూమి, దక్షిణాన జిసి క్లబ్ సరిహద్దులుగా నిర్ణయించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ స్థలంపై ఎవరైనా ఆక్రమణగాని, క్రయవిక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆ బోర్డులో హెచ్చరించారు.

లేగదూడలపై శునక ప్రతాపం
రాజాం, మార్చి 16: రాజాం నగర పంచాయతీ సారధి గ్రామంలో వందలాది శునకాలు స్వైర విహారం చేసి మనుషులను కరవడంతో పాటు లేగదూడలు, కోళ్లను పొట్టన పెట్టుకుంటున్నాయి. గురువారం రాత్రి కృష్ణ, అడపా అప్పలనాయుడులకు సంబంధించిన లేగదూడలను కరిచి తీవ్రంగా గాయపరిచాయి. రెండు లేగదూడలు చనిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు గ్రామంలో మూడు నెలల కాలంలో కుక్కకాటుకు 12 మంది వరకు గురయ్యారని, నగర పంచాయతీ అధికారులు జోక్యం చేసుకొని వీటిని నిర్మూలించాలని కోరుతున్నారు.

క్రమశిక్షణ తప్పిన కార్యకర్తలకు టిడిపిలో స్థానం లేదు
సరుబుజ్జిలి, మార్చి 16: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి గూర్చి ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందని అటువంటి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీకి దూరం చేయడం జరుగుతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మొదలవలస రమేష్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లావేటి పూర్ణారావు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సంవత్సరంగా ఈ ఏడాది పాటు పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి మండలానికి ఇన్‌చార్జిలను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. సరుబుజ్జిలి మండల ఇన్‌చార్జిగా తాను బాధ్యతలు చేపట్టానని, మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లోని తెలుగుదేశం పార్టీ అనుచరులతో సమావేశాలు నిర్వహించి పార్టీ అభ్యున్నతితో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించడానికి ప్రతి ఒక్కరు తనకు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజనతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన రాజకీయ అనుభవంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టే విధంగా టిడిపి శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏ ఎంసి చైర్మన్ పల్లి భాస్కరరావు, మాజీ జెడ్‌పిటిసి శివ్వాల సూర్యనారాయణ, టిడిపి నాయకులు సురేంద్ర, రమణ, చినబాబు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.