చిత్తూరు

జిల్లాలో కొత్తగా 64,910 మందికి ఓటు హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 16: జిల్లాలో కొత్తగా 64,910 మందికి ఓటు హక్కు దక్కింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికలు సంఘం అర్హత ఉన్న వారికి విధిగా ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 70,026 మంది తమకు కొత్తగా ఓటు హక్కు కల్పించాలని దరఖాస్తులు చేసుకొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఇటీవల వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఇంటింటా సర్వే నిర్వహించారు. 64,910 మంది అర్హులుగా గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించారు. మదనపల్లి నియోజక వర్గం నుంచి 18,210 మంది దరఖాస్తులు చేసుకొంటే అంలో 17, 498 మందికి అవకాశం కల్పించారు. జిల్లాలో అత్యధికంగా మదనపల్లి నియోజక వర్గంలోనే కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. తంబళ్ళ పల్లిలో 2584, పీలేరులో 3859, పుంగనూరులో 4366, చంద్రగిరిలో 6342, తిరుపతిలో 4628, శ్రీకాళహస్తిలో 4570, సత్యవేడులో 3265, నగరిలో 3209, జి డి నెల్లూరులో 3274, చిత్తూరులో 2402, పూతలపట్టులో 2993. పలమనేరులో 2793, కుప్పం నియోజక వర్గంలో 3127 మందికి కొత్తగా ఓటు హక్కు లభించింది.

వచ్చే ఎన్నికలే తెలుగు యువతకు టార్గెట్ కావాలి
* ప్రతి పక్షాల వైఖరిని ప్రజలకు వివరించండి
* జిల్లా టీడీపీ అధ్యక్షులు నాని
చిత్తూరు, మార్చి 16: రానున్న ఎన్నికలను తెలుగు యువత టార్గెట్ చేసుకొని తిరిగి తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు నాని పిలుపు నిచ్చారు. శుక్రవారం చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత కార్యవర్గ సమావేశం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నాని మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు పార్టీకీ అత్యంత కీలకమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టు కొని యువత కార్యవర్గం పార్టీని బలోపేతం చేయాలన్నారు. ముఖ్యంగా నేటి కేంద్రం రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని గ్రామీణ ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. గతంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పి , నాలుగేళ్లుగా టీడీపీ పై విమర్శలు చేయని పవన్ నేడు కొన్న దృష్ట శక్తులకు లోబడి మాట మార్చడం దారుణమన్నారు. కేంద్రం చేసిన నమ్మక ద్రోహాన్ని వవన్ కల్యాణ్ ఎక్కడా ప్రస్తావించక, అవినీతిలో కూరుకుపోయిన వైకాపాను విమర్శంచక కేవలం టీడీపీపైనే బురదజల్లే ప్రయత్నం చేయడంలో మర్మమేమమిటో ప్రజలు గుర్తించాలన్నారు. ఈ విషయాన్ని యువత కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెల్లాలన్నారు. బీజేపి నీచరాజకీయాలకు పాల్పడుతుందన్నారు. కేంద్రం వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా నష్ట పోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం బీజేపి , వైకాపాతో పవన్ కళ్యాణ్ కుమ్ముకైన విషయాన్ని అందురూ గుర్తించాలన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ బీజేపికు గుడ్ బై చెప్పడం వల్ల మైనారిటీ, ఎస్సీల్లో టీడీపీ పట్ల మంచి అభిప్రాయం ఉందన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించనున్నారని ఈ విషయాన్ని కూడా పార్టీ శ్రేణులు గమనించాల్సి ఉందన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనుల నేడు దళిత వాడల్లో జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇతరు వర్గాలకు నేటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెల్లి వారిని చైతన్య పరిచి టీడీపీ పట్ల మక్కువ చూపే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలుగు యువత కార్యవర్గం క్రమశిక్షణతో మెలగాలన్నారు. జనసేన అధ్యక్షులు కూడా దిగజారుడు రాజీయాలకు పాల్పడం దారుణమన్నారు. నాలుగు సంవత్సరాలుగా టీడీపీ పాలనలో చోటు చేసుకొని తప్పులు నేడు జరిగాయని పవన్ ఆరోపించడలో అర్థం లేదన్నారు. ఈనీచ రాజకీయాలకు చరమగీతం పాడాలంటే తెలుగు యువత మరింత బాధ్యతతో పని చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచే విధంగా యువత చురుకైన పాత్ర వహించాలన్నారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బీజేపీ, పవన్ కల్యాణ్‌తోతెలుగు దేశం పార్టీ ఒరిగింది అంటూ ఏమి లేదన్నారు. వైకాపా అవినీతి వంతమైన పార్టీ అని చెప్పిన పవన్ నేడు అపార్టీతో జత కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ వైకాపా పార్టీలకు విచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో తెలుగు యువత నేతలు రాజేష్, పవన్, అమరనాధ్, బానుప్రకాష్, టీడీపీ ఉపాధ్యక్షురాలు ఇందిరా, పలువురు తెలుగు యువత కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సుగుణమ్మను సన్మానించిన తెలుగు మహిళలు
తిరుపతి, మార్చి 16: రాష్ట్ర శాసన సభలో ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మను తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. అమరావతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటు, రాష్ట్ర మంత్రి అమరనాథ్‌రెడ్డికి శాలువాకప్పి సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బ్యాంకుశాంతమ్మ, కవిత, సంపూర్ణ, భారతి, అనిత, హేమ, సుగుణ, పద్మ, అరుణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.