విశాఖ

నకిలీ వస్తువుల విక్రయంపై కేసులు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మార్చి 16: విశాఖ మన్యంలోని వారపు సంతల్లో నకిలీ వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ అధికారులను ఆదేశించారు. అరకులో శుక్రవారం నిర్వహించిన వారపు సంతలో నకిలీ వస్తువుల దుకాణాలను బృందం సభ్యులతో కలిసి ఆయన తనిఖీ చేసారు. మండలంలోని చినలబుడు అంగన్‌వాడీ కేంద్రం పనితీరును, ఆనందలహరి విద్యాబోధన విధానాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గిరిజనుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న నకిలీ వస్తువుల విక్రయాన్ని వెంటనే నిరోధించాలని చెప్పారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ వస్తువులు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని నకిలీ వస్తువులు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్రం ఒడిస్సా వ్యాపారులు, మైదాన ప్రాంత గిరిజనేతర వ్యాపారులపై సుమోటాగా కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఏజెన్సీ వాసులకు సరసమైన ధరలతో నాణ్యమైన సరుకులను అందించే బాధ్యత అధికారులపై ఉందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో నకిలీ వస్తువులు వారపు సంతల్లో విక్రయిస్తే జాతీయ ఆహార భద్రత చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ దండోరా వేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నట్టు తమ తనిఖీలో గుర్తించామని ఆయన చెప్పారు. బాల బాలికలు, గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషక ఆహారాన్ని అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అధ్వాన్నంగా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. గిరిజన ప్రాంతంలో పోషకాహార సమస్య తీవ్రంగా ఉందని, దీనిని అరికట్టడానికి అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. గిరిజనులలో రక్తహీనత అధికంగా ఉండడంతో మరణాలు సంబవిస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని సంపూర్ణ పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని బృహత్తర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు పుష్పరాజు తెలిపారు. అనంతరం పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గిరిజనులు కమిషన్ బృందానికి వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఎల్.బి.వెంకటరావు, విజయకుమార్, శ్రీనివాసరావు, కృష్ణమ్మ, స్వర్ణగీత, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.