నిజామాబాద్

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఇవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మర్‌పల్లి, మార్చ 16: మండలంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఇఓ నాంపల్లి రాజేష్ శుక్రవారం తనిఖీ చేశారు. కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, హసాకొత్తూర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య, గైర్హాజర్ వివరాలు ఎంఇఓ ఆంధ్రయ్యను అడిగి తెలుసుకున్నారు.

అకాలవర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు
మోర్తాడ్, మార్చి 16: మోర్తాడ్ సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎర్రజొన్న రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. రెండు రోజులుగా మేఘావృత్తమైన ఆకాశం, శుక్రవారం మధ్యాహ్నం నుండి చిరుజల్లులుగా కురియడంతో పరుగులు పెట్టిన రైతులు తార్పాలిన్ కవర్లతో ఎర్రజొన్న బ్యాగులను కప్పేశారు. మోర్తాడ్, ఏర్గట్ల తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, మోర్తాడ్ సొసైటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికే ఎక్కువగా ఎర్రజొన్నలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ఎర్రజొన్నలను పండించడమే దీనికి కారణం. సొసైటీ చైర్మన్ బంగ్లా రాజేందర్‌రెడ్డి దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎర్రజొన్నలను తరలిస్తున్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకవచ్చిన ఎర్రజొన్నలను తూకం వేయించి వెంటది వెంట లారీల్లో నింపుతూ పంపిస్తున్నారు. అయితే శుక్రవారం వర్షం కురుస్తుండటంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులంతా తార్పాలిన్ కవర్లను తీసుకవచ్చి ఎర్రజొన్నల బ్యాగులను కప్పివేశారు. శనివారం ఉదయమే మొత్తం ఎర్రజొన్నలను తూకం వేయించి పంపిస్తామని సొసైటీ సిబ్బంది తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
* కలెక్టర్ సత్యనారాయణ
కామారెడ్డి, మార్చి 16: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని, మొక్కలు నాటడంతోనే సరిపోదని వాటిని రక్షించి చెట్లుగా ఎదిగే వరకు చూడాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వాటరింగ్‌డే సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సిబ్బందితో కలిసి నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కూడా వాటరింగ్ డే నిర్వహించడం జరుగుతోందని, ప్రతి అధికారి సిబ్బంది కార్యాలయాల్లోని ఆవరణలో నాటిన మొక్కలకు నీరు పోయడంతోపాటు వాటి ఎదుగుదలను పరిశీలించాలన్నారు. జిల్లాలో పచ్చదనంతో పాటు స్వచ్చతపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ప్రతి మనిషికి ఆక్సిజన్ అవసరం అని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ లభించేది చెట్ల నుండి అని కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను కాపాడుకోవడంతో పాటు వ్యవసాయ పొలాల్లోని ఖాళీ స్థలాల్లో ఇండ్లలోని పెరిటిలో మొక్కలు విరివిగా నాటాలని సూచించారు. ఇంతే కాకుండా ప్రతి కాలనీలో మొక్కలు నాటేందుకు స్థలాన్ని ఏర్పాటు చేసుకుని మొక్కలు నాటాలని, మీకు దగ్గర్లో ఎదైన మొక్క ఎండిపోతే దాన్ని బ్రతికించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.