రాష్ట్రీయం

బెదిరేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలోని 25మంది ఎంపీలపై కేంద్రం బ్లాక్‌మెయిల్ విధానాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్ధతి కాదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంపీలను కేంద్రం భయపెట్టవచ్చునేమోగానీ, రాష్ట్రంలోని ఐదు కోట్ల ఆంధ్రుల్ని భయపెట్టలేదన్నారు. జనసేన సైనికులం కేంద్రం అనుసరిస్తున్న బ్లాక్‌మెయిల్ విధానాలకు బెదరబోమని హెచ్చరించారు. నాడు రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేకూరుతుందనే ఆశతోనే టీడీపీ, బీజేపీలకు మద్ధతు ఇచ్చానని గుర్తుచేశారు. తాను ఎలాంటి పదవులు ఆశించలేదని, కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదన్నారు. ఇచ్చిన హామీలపై రెండు పార్టీలు మాట తప్పాయని, రాష్ట్భ్రావృద్ధిపై నిర్లక్ష్యం చూపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి పెరిగిపోయిందని పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు. మా నాన్న కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడేనన్నారు. వామపక్ష, సోషలిస్ట్ భావజాలాలను తాను గౌరవిస్తానని, ప్రజలకు ఇచ్చిన మాటపైనే నిలబడాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నారని, వారంతా ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి తిరిగి ఒంటరిగా పోటీ చేసి గెలుపొందాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై నాలుగు సంవత్సరాలు ఉద్యమిస్తున్నామని, దాని ఫలితంగానే టీడీపీ, వైసిపీల్లో కదలిక వచ్చిందన్నారు. ఎన్నికల హామీలు, విభజన చట్టాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల్ని టీడీపీ, బీజేపీ మోసగించాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు
కనువిప్పు కలిగేలా భవిష్యత్తులో ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అరగంటపాటు చర్చలు
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సీపీఐ, సీపీఎం ముఖ్యనేతలు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దాదాపు అరగంటపాటు చర్చించారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పరస్పర అభిప్రాయాలను వెల్లడించారు. తొలుత కార్యాలయానికి వచ్చిన పవన్‌కు వామపక్ష పార్టీల నేతలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులు దీక్షకు ముందే 100 కోట్లు మంజూరు చేయడం ఆనందదాయకమని జనసేన నేత పవన్‌కళ్యాణ్ అన్నారు. శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు తలపెట్టిన జర్నలిస్టుల సామూహిక నిరాహర దీక్షకు మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు న్యాయమైనవేనని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. మాటపూర్వక హామీ కాకుండా కార్యాచరణ ప్రకటిస్తే అభినందిస్తామన్నారు. ప్రభుత్వం నుండి చివరి రూపాయి వచ్చే వరకు పొరాటం అపవద్దని, జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు.

చిత్రం..వామపక్ష నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్