రాష్ట్రీయం

ప్లీజ్.. మాతో కలిసిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: ఎన్డీయే నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్న వెంటనే సీఎం చంద్రబాబు తన దృష్టిని మళ్లీ జాతీయస్థాయి రాజకీయాల వైపు సారించారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయమే దేశంలోని పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీ అధినేతలకు ఫోన్లు చేశారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందన్న వార్త తెలియడంతో ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ.. సీఎం చంద్రబాబుకు ఫోన్లు చేసి అభినందించారు. సరైన నిర్ణయానికి బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎన్డీయే పక్షపాత, కక్షపూరిత వ్యవహార శైలికి నిరసనగానే కేంద్రం, ఎన్డీఏ నుంచి బయటకు రావలసి వచ్చిందని పలువురు జాతీయ పార్టీ నేతలకు బాబు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీతోనే ఎన్నికలకు ముందు బీజేపీతో కలసి పోటీ చేశామన్నారు. అయితే నాలుగేళ్లయినా హోదా ఇవ్వకపోగా, ఇస్తామన్న ప్యాకేజీ నిధులకూ మోకాలడ్డి ప్రజలను ఎన్డీయే అవమానించిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే తమ రాష్ట్రంలోనూ పార్టీల మధ్య చిచ్చుపెట్టి, రాజకీయ ప్రయోజనం పొందే కుట్ర చేసిందని అన్నారు. ఈ కారణాల వల్లే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవిశ్వాసం పెట్టామని వివరించారు. తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ కూడా తీర్మానానికి అనుకూలంగా సంతకం చేయడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా శుక్రవారం ఉదయం నుంచే చకచకా పావులు కదిపిన చంద్రబాబు ప్రయత్నానికి ఫలితం కనిపించింది. టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్, టీఎంసీ, బీజేడీ, అన్నాడిఎంకె, సీపీఎం, మజ్లిస్, టీఆర్‌ఎస్, సీపీఐ, ఏఏపీ వంటి పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా నిలుస్తామని ప్రకటించాయ.