హైదరాబాద్

యువతకు ఉపాధి.. నిరుద్యోగ భృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 19: దేశంలో రైతులకు అసలు వడ్డీ పూర్తిగా మాఫీ చేయడంతో పాటు యువతకు ఉపాధి నిరుద్యోగ భృతి కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ ప్లీనరీలో చర్చించినట్లు ఏఐసీసీ సభ్యుడు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ వివరించారు. ఏఐసీసీ సభ్యుడిగా నియమితులైన కేఎల్‌ఆర్‌ను సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేఎల్‌ఆర్‌ను సత్కరించడంతో పాటు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. విలేఖరుల సమావేశంలో కేఎల్‌ఆర్ మాట్లాడుతూ.. మేడ్చల్ ప్రజల దీవెనలతోనే తనకు ఈ పదవి దక్కిందని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ యువనాయకులను ప్రోత్సాహిస్తున్నారని, దేశంలో జిల్లాలో యువకులకు అవకాశాలు కల్పించాలని అన్నారు. దేశంలో 70 శాతం మంది రైతులే ఉన్నారని రైతులను అదుకునేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. 2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి శ్రేణులు అంకితభావంతో కృషి చేయాలని కోరారు. అన్ని రంగాలను ఆదుకునేది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట్, ఘట్‌కేసర్, కీసర మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేఎల్‌ఆర్‌ను ఘనంగా సత్కరించారు. వరదారెడ్డి, నడికొప్పు బాలమల్లేశ్, రాగజ్యోతి, మల్లేశ్ గౌడ్, కొండల్ రెడ్డి, రాఘవేందగర్ గౌడ్, నరేందర్, పోచయ్య, వేముల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీ. లక్ష్మణ్ రావు, సంజీవ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గణేశ్, దాత్రిక లింగం, సంజీవ రావు పాల్గొన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ఎంతో అవసరం
ఖైరతాబాద్, మార్చి19: ప్రస్తుత రోజుల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రతిఒక్కరికీ ఎంతో అవసరమని, భవిష్యత్‌లో సర్ట్ఫికెట్ లేనిదే ఉద్యోగావకాశం దొరకదని మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి అభిప్రాయపడ్డారు. పంజాగుట్ట, ద్వారకాపురి కాలనీలోని కేసీ పుల్లయ్య ఫౌండేషన్ భవనంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. అనిల్‌కుమార్, శాంతమూర్తి, నాగభూషణంతో కలిసి మాట్లాడుతూ.. పుల్లయ్య సేవలు మరువలేనివని, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఎంతోమందికి దిక్సూచిలా పనిచేస్తోందని, నిరుద్యోగులకు ఉన్న టాలెంట్‌కు శ్రద్ధను జతచేస్తే స్కిల్ అవుతుందని అన్నారు. చదువు మధ్యలో ఆపి ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించుటకు వృత్తి విద్యాకోర్సులు టైలరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనంతోపాటు బస్సు చార్జీలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుధా చల్ల, అఖిల రాఘవేంద్ర, ప్రాజెక్టు ఆఫీసర్ ఫణి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
దిల్‌సుఖ్‌నగర్, మార్చి 19 : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. గడపగడపకు టీడీపీలో భాగంగా సోమవారం ఎల్‌బినగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్‌లోని న్యూమారుతీనగర్, పణిగిరికాలనీ, శ్రీలక్ష్మీనరసింహా కాలనీ, ఇందిరానగర్, వినాయకనగర్‌లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలల్లో లక్ష్మీనరసింహ కాలనీలో బోరును బాగుచేసి మంచినీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తానని నమ్మబలికిన ఇప్పటికీ చేయలేదని గుర్తుచేశారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి, వెంకట్ గాంధీ, సురేష్ నాయుడు, శ్రీధర్, శివ, అనంతయ్య, సాగర్, శేషు, రాహుల్, కిరణ్, శ్రీశైలం గౌడ్, సత్యనారాయణ, అశోక్‌కుమార్, రవిశంకర్, కృష్ణంరాజు, మురళీధర్ రెడ్డి, రమేష్, జగన్, లింగం పాల్గొన్నారు.

చెస్ విజేతలు జ్ఞానదీప్, స్నేహ
హైదరాబాద్, మార్చి 19: రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ని ర్వహించిన ర్యాకింగ్ చెస్ టోర్నమెంట్‌లో జ్ఞానదీప్, స్నేహ విజేతలుగా నిలి చి ట్రోఫీలను గెలుచుకున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టోర్నమెం ట్ అండర్-15 బాలుర విభాగంలో జ్ఞాదీప్, చైతన్యకుమార్, అఖిల్, బాలికల విభాగంలో స్నేహ, జ్ఞయనిత, హరిణి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అండర్-13 విభాగం బాలురలో ముకుంద్ తుషార్, సహస్రాంష్, జశ్వంత్ సాయి నికేత్, బాలికల్లో సహస్ర, కీర్తిగ, ధనసాయి, అండర్-11లో ధనుష్ రెడ్డి, ఆర్యన్, విశ్వ, బాలికల్లో గీతిక హాసిని, సాన్వి, అండర్-9లో అరవ్, శశాంక్, సాయి రుత్విక్, బాలికల్లో సహేజాదీప్ కౌర్, శ్రేయస్ కుల్‌కర్ణి, యువికా గుప్తా, అండర్-7లో శ్రవణ్, నిహాల్, ఆదిత్య, ఆక్షయ లక్ష్మీరెడ్డి, లేఖశ్రీ, అనయ అగర్వాల్ వరుస స్థానాల్లో నిలిచి పతకాలు గెలుచుకున్నారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్ విచ్చేసి ట్రోఫీలను అందజేశారు.