క్రీడాభూమి

బాధపడడానికేముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 19: భారత్‌తో ఆదివారం జరిగిన నిదహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీ ఫైనల్ పోరులో తమ జట్టు పరాజయం పాలవడంతో బాధపడాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాకీబ్ అల్ హసన్ అన్నాడు. ఎక్కడ తప్పులు జరిగాయో గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని, భవిష్యత్‌లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని అన్నాడు. ఫైనల్‌లో పరాజయంపై ఎలాంటి బాధపడడం లేదా అని మీడియా అతనిని ప్రశ్నించినపుడు ‘ఇందులో ఏడవడానికి ఏముందో నాకైతే అర్ధం కావడం లేదు..కానీ ఓడిపోయినపుడు భావోద్వేగాలు ఎవరికైనా సహజం’ అని ఆయన వ్యాఖ్యానించాడు. తుదిపోరులో టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ ఎనిమిది బంతుల్లో 29 పరుగులు చేయడంతోపాటు ఆఖరి ఓవర్‌లోని చివరి బంతిని సిక్సర్‌గా మలచి ట్రోఫీ దక్కేలా అద్భుతంగా ఆడాడని, కానీ ఇలాంటి అరుదైన చాన్స్ అన్నివేళలా రాదని అన్నాడు. ఈ నేపథ్యంలో తాము ఆడే భవిష్యత్‌లో ఆడే మ్యాచ్‌లలో బాగా రాణిస్తామనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
ఎక్కువ పరుగులిచ్చా...క్షమించండి: బంగ్లా పేసర్ రూబెల్
ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన నిదహాస్ టీ-20 ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఎక్కువ పరుగులిచ్చి భారత్ గెలుపునకు పరోక్షంగా సహకరించిన బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హొస్సేన్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆఖరి పోరులో బంగ్లాదేశ్ 167 పరుగులు చేయగా, భారత్ నాలుగు వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు బంగ్లాదేశ్ జట్టుదే నిదహాక్ ట్రోఫీ అంతా అనుకుంటున్న తరుణంలో మ్యాచ్‌లో చివరి ఓవర్ బంగ్లాదేశ్ జట్టును ముంచింది. 19 ఓవరల్లో బంగ్లా పేసర్ రూబెల్ హొస్సేన్ ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. ‘ఈ ఓటమి అతి భయంకరమైనదిగా భావిస్తున్నా..ఇలా జరుగుతుందని, తమ జట్టు ఓటమిని తానే కారకుడను అవుతానని కలలో కూడా అనుకోలేదు. 18 ఓవర్లు అయ్యాక భారత్ ఇంకా 34 పరుగులు చేయాల్సి ఉంది. కానీ గెలుపు మాదేనన్న ధీమాతో ఉన్నాం..కానీ ప్రత్యర్థిని వరించింది. ఇందుకు ప్రధాన కారకుడను నేనే..అందుకు అభిమానులంతా క్షమించాలి’ అని ఆయన వేడుకున్నాడు. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌ను ఒక మలుపు తిప్పి కేవలం ఎనిమిది బంతుల్లో 29 పరుగులు చేసి టీమిండియాకు నిదహాస్ ట్రోఫీ దక్కేలా అద్భుతంగా రాణించిన ఘనత వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌కే దక్కుతుందని ఆయన అన్నాడు. ఇదిలావుండగా బంగ్లాదేశ్ కెప్టెన్ షాకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ తమ జట్టు పేసర్ రూబెల్ హొస్సేన్ చక్కని ప్రణాళికతో, నిజాయతీగా బౌలింగ్ వేశాడన్నాడు. చాలామంది క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్నపుడు తొలి బంతిని సిక్స్‌గా మలుస్తారని, ఆ తర్వాత బంతిని బౌండరీగా, మళ్లీ మరో బంతిని ఎదుర్కోవాల్సి వచ్చినపుడు సిక్సర్‌గా మలుస్తారని, అదే భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ చేశాడని అన్నాడు. భారత జట్టు 18 ఓవర్‌సరికి ఐదు వికెట్లు ప్రధాన వికెట్లు కోల్పోయి 133 పరుగులతో ఉన్నపుడు తానున్నానంటూ బ్యాట్ చేపట్టిన వెంటనే బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హొస్సేన్ వేసిన వరుస మూడు బంతులను ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ మూడు బంతులను రెండు వరుస సిక్సర్లు, ఒక బౌండరీగా మలచిన తీరు అద్భుతం. అనంతరం ఆఖరి బంతికి మరో ఐదు పరుగులు జత చేయాల్సి ఉండగా, ఆ బంతిని మరో సిక్సర్‌గా మలచి మొత్తం ఆటనే ఒక మలుపు తిప్పి భారత్‌కు ఘనమైన విజయాన్ని అందించాడు.