క్రీడాభూమి

దుబాయ్‌లో షమీని కలిసింది నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి పాకిస్తాన్ యువతి ఆలిషబాతో సంబంధమున్నట్లు ఆమె ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దక్షిణాఫ్రికా పర్యటనంతరం షమీ నేరుగా భారత్‌కు రాకుండా దుబాయ్‌లో అలిషబాను కలిసాడని జహాన్ మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో కీలకంగా మారిన అలిషబా స్పందిస్తూ ఈ ఆరోపణలను కొట్టిపడేసింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌పై భారత్ ఓడిన మ్యాచ్ నుంచే షమీ తనకు తెలుసునని అలిషబా చెప్పింది. ఆ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో అతని ఫేస్‌బుక్ ప్రొఫైల్ వెతికి మెసేజ్ పంపించానంది. షమీ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆనిమానులందరికీ ఇష్టపడే క్రికెటర్‌ను కలవాలనే కోరిక ఉంటుందని, అలానే తాను షమీని కలిశానన్నారు. అతనికుండే లక్షల ఫాలోవర్స్‌లో తాను ఒకరినని, ఓ సాధారణ అభిమానిగానే అతనికి మెసేజ్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని, ఓ క్రికెటర్‌గా అతన్ని గౌరవిస్తానంది. ఆ పర్యటన అనంతరం షమీ దుబాయ్ నుంచి భారత్‌కు వెళ్తున్నాడని అనుకోకుండా తెలిసిందని, ఆ సమయంలో తాను తన అక్కచెళ్లెళ్ల వద్దకు వెళ్తున్నానని, వారు దుబాయ్‌లో నివిసిస్తుండటంతో తరుచుగా అక్కడికి వెళ్తుంటానని, దీనిలో భాగంగానే షమీని కలిసినట్లు అలిషబా చెప్పుకొచ్చింది. ఇక షమీతో హోటల్‌లో గడిపానని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించింది. ఆ రోజు తాను నేరుగా తన సోదరి నివాసానికి వెళ్లానని, మరుసటి రోజు షమీ భాయ్‌తో కలసి ఆ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే చేశానంది. షమీభాయ్ వ్యక్తిగత జీవితం, ఫిక్సింగ్ ఒప్పందాల గురించి తనకు తెలియదని అంది. అబద్దాలు కూడా చెప్పని వ్యక్తి, తన దేశానికి నమ్మక ద్రోహం ఎలా చేస్తాడని అమె ప్రశ్నించింది. షమీపై అతని భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో పలు కేసులు నమోదయ్యాయి. అలిషబా మాట్లాడిన తీరు చూస్తే, మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో తప్పించుకుంనేందుకుగాను చేసిన వ్యాఖ్యలుగా తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైనప్పటి నుంచే షమీ తనకు తెలుసునని చెప్పడంలో ఆంతర్యమేమిటని క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షమీ-హసీన్ జహాన్ కేసుకు సంబంధించి బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు త్వరలో పాకిస్తాన్ యువతి అలిషబాను కూడా విచారించనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు.
‘నా వైవాహిక జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్ర‘
‘అలిష బా తన భర్త మహ్మద్ షమీకి స్నేహితురాలు కాదు..అభిమాని కూడా కాదు..ఏ మహిళ అయినా వివాహమైన వ్యక్తితో హోటల్‌లో గడుపుతుందా? అతని గదికి వెళ్లి...అతని పడక గదిని పంచుకుంటుందా? నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలనే కుట్రతోనే ఆమె హోటల్‌కు వచ్చింది’ అని హసీన్ మీడియాకు తెలిపింది. తన భర్త షమీపై వివాహేతర సంబంధాల కేసులో హసీన్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి సోమవారం అలీపోర్ కోర్టు మేజిస్ట్రేట్‌కు ఆమె వాంగ్మూలాన్ని ఇచ్చింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ యువతి తీరుతెన్నులపై నిప్పులు చెరిగింది.