కరీంనగర్

మూగ వేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 19: సమస్యల సాలెగూటి నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ అధికారులకు పెట్టుకున్న అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. ప్రజాప్రతినిధులకు చేసుకున్న విజ్ఞప్తులు గాలిలో కలిసిపోతున్నాయి. తమకోసం కేటాయించిన ఉద్యోగాలు ఇతరులతో భర్తీ అవుతున్నాయి. అన్ని అర్హతలున్నా తాము మాత్రం వీధుల్లో తిరుగుతున్నామంటూ మూగ మనుషులు వేదన చెందుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి, విసిగి వేసారిన వారంతా ఒక్కతాటిపైకి వచ్చి సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి, ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలు తీర్చే వరకు కదిలేది లేదంటూ మూకుమ్మడిగా మూగ సైగలతోనిరసన తెలిపారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్ళేయత్నం చేయగా, అడ్డుకున్న ఔట్‌పోస్టు పోలీసులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. స్పందించిన ఆయన వికలాంగుల శాఖ ఏడీని పంపి, సమస్యలు తెల్సుకోవాలంటూ ఆదేశించారు. ఆందోళనకారుల వద్దకు ఏడి వారి నుంచి వివరాలు సేకరించి, కలెక్టర్‌కు నివేదిస్తానని తెల్పగా, తాము కూడా కలెక్టర్‌ను కలిస్తామని పట్టుబట్టారు. దీంతో వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులను తీసుకుని ప్రజావాణిలో ఉన్న కలెక్టర్ వద్దకు తీసుకెళ్ళారు. పలు సమస్యలతోకూడిన వినతిపత్రాన్ని అందజేయగా, పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ఈసందర్భంగా విహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు జక్కం సంపత్ మాట్లాడుతూ, గతేడాది మార్చి 31వరకు అన్ని శాఖల్లో ఖాళీలు పరిశీలించి, బదిరులతోభర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంధుల కేటగిరీలో టైపిస్టు ఖాళీలకు అర్హత లేకపోవటంతో, వాటిని బదిరులతో భర్తీ చేయాలని, ఈ ఏడాది బదిరుల కోటాలో చేపట్టిన నియామకాల్లో మాటలు వచ్చే వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కట్టబెట్టేయత్నం చేస్తున్నారని, వెంటనే ఉపసంహరించుకుని బదిరులకు అవకాశమివ్వాలని కోరారు. సబ్సీడీ రుణాల మంజూరీలో బ్యాంకర్లు బదిరులకు మొండిచేయి చూపుతున్నారని, దీనిపై స్పందించి వెంటనే రుణాలిప్పించి, స్వయం ఉపాధి పథకాలు మంజూరీ చేయించాలని, ఫిషర్‌మెన్ ఉద్యోగాల కోటాలో అంధులు లేకపోగా, బదిరులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా గంటకు పైగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీనివాస్, రాజమల్లయ్య, అక్కిరాజు మల్లేశం, వివి భాస్కర్, టింకు తిరుపతి, మొద్దు శ్రీను, తదితరులతో పాటు 200మంది బధిరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక కారిడార్‌గా జగిత్యాల జిల్లా
రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు రాజేశంగౌడ్
సారంగాపూర్, మార్చి 19: జగిత్యాల జిల్లాను ఆధ్యాత్మిక కారిడార్‌గా అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు గొడిసెల రాజేశంగౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని పెంబట్ల గ్రామంలో గల దుబ్బరాజేశ్వరస్వామి ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిని అభివృద్ధి పరిచి ఆధ్యాత్మిక కారిడార్‌గా చేయడానికి తనవంతు కృషిచేస్తానన్నారు. కొండగట్టు నుండి దుబ్బరాజన్న, రోళ్లవాగు ప్రాజెక్టు, ధర్మపురి లక్ష్మి నర్సింహస్వామి తదితర పుణ్యక్షేత్రాలంన్నింటినీ సుదూర ప్రాంతాల భక్తులు దర్శించుకునేలా కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలో హరిత హోటల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు బస్సు నడిచేలా చొరువ చూపుతానన్నారు. దుబ్బరాజన్న ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పూర్తి స్థాయి ప్రణాళికతో తన వద్దకు రావాలని ఇఓ పురుషోత్తమచార్యులు, ధర్మకర్తలకు రాజేశంగౌడ్ సూచించారు. ఆలయాన్ని సందర్శించిన రాజేశంగౌడ్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ జన్మనిస్తే కేసిఆర్ రాజకీయ పునర్జన్మను ప్రసాదించారన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టు చైర్మన్ పొరండ్ల శంకరయ్య, ధర్మకర్తలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు