కరీంనగర్

మలుపు తిరుగుతున్న మున్సిపల్ చైర్‌పర్సన్ రాజీనామా పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 19: సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని కమీషన్ల వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేవడం, ఆమె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఉదంతం అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అనేక కోణాలను ఆవిష్కరిస్తూంగా, అధికార పార్టీలోని లోగుట్టు వ్యవహారం రచ్చ కెక్కి తీవ్ర సంచనాలకు వేదికగా మారింది. అయితే రాజీనామా చేసిన పావనిని బలి పశువును చేశారని, మహిళను, అందునా బీసీ మహిళను ఇలా చేయడమేమిటని విపక్షాలు ప్రశ్నల పర్వం సందిస్తున్న నేపథ్యంలో పావనికి పరోక్షంగా సర్వత్రా సానుభూతి, మద్దతు పెరుగుతుంగా, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా రాజకీయ దుమారం కొనసాగుతున్నది. పట్టణ ప్రజల్లోనూ పావనిపై సానుభూతి పెరగడంతో దీనిపై అప్పటి కపుడే, రాత్రికి రాత్రే ఆమెను రాజీనామా చేయించిన తెరాస అధిష్టానం పునరాలోచనలో పడినట్టుగా సంకేతాలు వినిపిస్తున్నాయి. పావని రాజీనామా చేసిన వెంటనే మున్సిపల్ పాలనకు భవిష్యత్ కార్యాచరణపై అనేక కోణాలు వెలుగు చూశాయి. తిరిగి ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న ఇద్దరు, ముగ్గురు సభ్యుల ప్రయత్నాలు ఆ దిశగా సాగుతుండగా, మరో కొత్త చైర్మన్‌ను ఎన్నుకోబోరని, ప్రస్తుతం పదవీ కాలం ఏడాది పాటే ఉండడంతో వైస్ చైర్మన్‌తోనే మమ అనిపిస్తూ పాలన సాగిస్తారని ప్రచారం సాగింది. కాగా కొత్త చైర్‌పర్సన్‌ను ఒక వేళ నియమిస్తే ఆ పదవికి మున్సిపల్ కౌన్సిలర్లు దార్నం అరుణ, బత్తుల వనజ, అన్నారం లావణ్యల పేర్లు వినిపిస్తుండగా అందులో ముందు వరుసలో ఆరుణ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. పావని రాజీనామా వ్యవహారంపై ఆమెను బలి పశువు చేసి ఆడిస్తున్నారని, మున్సిపల్‌లో జరుగుతున్న కమీషన్ల పర్వంను, వారు ఎదుర్కుంటున్న సమస్యలను కాకతాళీయంగా బహిర్గం చేసిన వ్యాఖ్యలపై పావని నిజం చెప్పారని విపక్షాలు నుండి మద్దతు లభిస్తున్నది. మరో వైపు దీనిపై మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఆయన మంత్రి పదవి నుండి వైదొలగాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ తదితర పార్టీలు డిమాండ్లు చేస్తున్నాయి. ఇంటిలో స్విచ్ వేస్తే ఎక్కడో లైటు వెలిగిన చందంగా ఈ పరిణామం అధికార పార్టీకి తల నొప్పిగా పరిణమించింది. దీని నుండి బయట పడడానికి యోచనలు చేస్తున్నది. నష్ట నివారణలో భాగంగా ఆదివారం ఉగాది పండుగ రోజు పార్టీ నేతలు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, నాయకుడు చీటి నర్సింగరావులు పార్టీ కౌన్సిలర్లతో అంతర్గత సమావేశం నిర్వహించి, పరిస్థితిపై సమీక్షించారు. అయితే రోజుకో తరహాలో పావని రాజీనామా ఉదంతం మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత లొల్లి, రాద్దాంతాన్ని సద్దుమణించడానికి పావని రాజీనామాను ఆమోదించకుండా, తిరిగి ఆమెనే చైర్‌పర్సన్‌గా కొనసాగించడం శ్రేయస్కరమని పార్టీ అధిష్టాన వర్గం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.