కరీంనగర్

బతుకమ్మ చీరెలు-2018 ఉత్పత్తి ప్రణాళిక జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 19: ‘బతుకమ్మ చీరెలు- 2018’ ఉత్పత్తి ప్రణాళికను జారీ చేసినట్టు జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వి.అశోక్‌రావు వెల్లడించారు. ఈమేరకు సోమవారం వివరాలను విడుదల చేస్తూ బతుకమ్మ చీరలు-2018లకు అవసరమ్యే మొత్తం వస్త్రాన్ని తెలంగాణలోని నేత కార్మికుల నుండి కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. దీని వల్ల సిరిసిల్లలోని ఆసాములకు, కార్మికులకు, అనుబంధ కార్మికులకు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గిట్టుబాటు కూలీతో, నిరంతరాయంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ చీరెల ఆర్డర్‌ను సిరిసిల్లలోని మరమగ్గాల మ్యాక్స్ సంఘాలు, చిన్న తరహా పరిశ్రమలకు ఉత్పత్తి ప్రణాళిక జారీకై ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. వస్త్ర ఉత్పిత్తి క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికే మార్చి-2018లోనే రాజీవ్ విద్యా మిషన్ 2018, సంక్షేమ శాఖలకు చెందిన వస్త్రాన్ని సిరిసిల్లలో ఉత్పత్తి చేసి టెస్కో హైదరాబాద్‌కు అందించినట్టు తెలిపారు. దీనితో ఈ సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులకు ఏకరూప దుస్తులే అందించే అవకాశం ఏర్పడిందన్నారు. దీని వలన మొత్త 120 లక్షల మీటర్ల, రూ.55 కోట్ల విలువ గల వస్త్ర ఉత్పత్తితో 15 వేల మరమగ్గాలకు, 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించిందన్నారు. అలాగే సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులోని చిన్న తరహా పరిశ్రమలకు 1022 లక్షల సాంఘీక శాఖ ఉత్పత్తి ఆర్డర్స్, రూ.25 లక్షల మీటర్ల రంజాన్ గిఫ్ట్ ఆర్డర్స్ జారీ చేశారన్నారు. దీని ద్వారా 1500 మంది కార్మికులకు నిరంతరాయంగా ఉపాధి లభిస్తుందన్నారు. అదే విధంగా బతుకమ్మ చీరెలతో సిరిసిల్లలో 25వేల మరమగ్గాలకు, 10 వేల మంది కార్మికులకు నేరుగా, మరో 10 వేల మంది అనుబంధ కార్మికులకు ఆరు నెలల పాటు ఉపాధి లభిస్తుందని జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు అశోక్‌రావు వెల్లడించారు.