తెలంగాణ

కోట్లకొద్దీ పెట్టుబడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమల స్థాపనకు రూ.1,24,664 కోట్లు
38.2 వేల కోట్లతో 4382 యూనిట్లు లక్షా 87 వేలమందికి ఉద్యోగావకాశాలు
6 నెలల్లో స్థాపించని యూనిట్లపై దృష్టి టీఎస్-ఐపాస్‌పై సిఎస్ జోషి సమీక్ష
హైదరాబాద్, మార్చి 21: టిఎస్-ఐపాస్ ద్వారా రాష్ట్రంలో రూ. లక్ష 24 వేల 664 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి వెల్లడించారు. వీటిలో ఇప్పటికే రూ.38,203 కోట్ల పెట్టుబడితో 4382 యూనిట్లు ప్రారంభమయ్యాయన్నారు. ప్రభుత్వ నుంచి అన్ని అనుమతులు లభించిన తర్వాత కూడా ఆరు నెలల్లో స్థాపించని యూనిట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హెచ్చరించారు. అయతే, యూనిట్లు స్థాపించకపోవడానికిగల కారణాలను యంత్రాంగం అధ్యయనం చేయాలని సిఎస్ ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన 4383 యూనిట్ల ద్వారా లక్ష 87 వేల 978 ఉద్యోగాలు లభించాయని సీఎస్ వివరించారు. సచివాలయంలో బుధవారం పరిశ్రమల స్థాపన పురోగతిపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమిషనర్ నదీమ్ అహ్మద్, రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహరెడ్డితో సీఎస్ జోషి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికి ప్రారంభమైనవే కాకుండా మరో 684 పరిశ్రమలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, ఎలక్ట్రికల్ వెహికిల్స్‌పై విధానాన్ని రూపొందించాలని సమావేశంలో ఆదేశించారు. సంబంధిత శాఖల నుంచి అభిప్రాయాలు తీసుకొని ముసాయిదా తయారు చేయాల్సిందిగా సీఎస్ అధికారులకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు (ఇఓడిబి) సంబంధించిన 372 సిఫారసులలో 362 అమోదం పొందగా 4 సిఫార్సులు వర్తించవని, మరో ఆరు సిఫార్సులు వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన యాక్ట్-1 జీవో 17, 42 సర్క్యులర్లు జారీ చేశామన్నారు. 78 అంశాలపై భాగస్వాములకు అవగాహన కల్పించనున్నట్టు సీఎస్ జోషి వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక సదుపాయాల సంస్థ చేపట్టిన 23 మెగా ప్రాజెక్టులకు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న మెగా టైక్స్‌టైల్ పార్క్, ఫార్మా సిటీ, నిమ్జ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారించాల్సిందిగా టిఎస్‌ఐఐసిని ఆదేశించారు. అనుమతి పొందిన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.