ఆంధ్రప్రదేశ్‌

డిప్యూటీ కలెక్టర్‌గా ‘కిడాంబి’ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సిరీస్ 2017 విజేత కిడాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. స్పోర్ట్సు కోటా కింద ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు గ్రూప్-1 సర్వీసెస్‌లో నియమించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. 30 రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లతో సీసీఎల్‌ఏను సంప్రదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. డాక్యుమెంట్ల పరిశీలన తరువాత జిల్లాను కేటాయిస్తారు.

ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో ఐఎఫ్‌ఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్ సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ డీఎఫ్‌ఓ ఆర్.యశోదా బాయిని విశాఖ జ్యూ క్యూరేటర్‌గా నియమించింది. ఆత్మకూరు వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌ఓ సెల్వంను విశాఖకు బదిలీ చేసింది. విశాఖలోని అలన్ చాంగ్ టెరన్‌ను డిప్యూటీ సీఎఫ్‌గా పీసీసీఎఫ్ కార్యాలయానికి బదిలీ చేసింది.

గడ్కరీకి కృతజ్ఞతలు

విజయవాడ, మార్చి 21: పోలవరం ప్రాజెక్టు కోసం రూ.1400 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా బీజేపీ శిక్షణ విభాగం రాష్ట్ర ఇన్‌ఛార్జి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.విష్ణువర్థన్ రెడ్డి బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.