ఐడియా

పోషకాహారంతో మధుమేహానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తగిన పోషకాహారం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచడం సాధ్యమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలతో పాటు కొవ్వు తక్కువగా ఉండే పాలను మధుమేహరోగులు తీసుకోవడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్‌కు మాత్రం వీలైనంత మేరకు దూరంగా ఉండాలి. గింజలు, మొలకలు వంటివి తీసుకోవచ్చు. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు నీటిలో నానబెట్టిన మెంతి విత్తనాలను తింటే మధుమేహం నివారణ సాధ్యమవుతుంది. ఉదయం పూట పరగడుపున టమాటా రసంలో చిటికెడు ఉప్పు లేదా మిరియాల పొడి వేసుకుని తాగాలి. నీటిలో నానబెట్టిన బాదం పప్పును ఉదయం పూట తినాలి. సుగర్ స్థాయిలను తగ్గించేందుకు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అందేలా కొవ్వులేని పాలను రెండు పూటలా తాగడం మంచిది. పీచు పదార్థాలు అధికంగా లభించే జామ, బొప్పాయి. ఆరంజ్, యాపిల్ పండ్లను తర చూ తీసుకోవాలి. సుగర్ శాతం అధికం గా ఉండే మామిడి, అరటి, ద్రాక్ష పళ్లను తీసుకోవడం బాగా తగ్గించాలి. మద్యం, స్వీట్లు, మాంసాహారాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి.