జాతీయ వార్తలు

పోంజీ స్కాం కేసు మాజీ అధికారి ఇంట్లో ఈడీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/చండీగఢ్, మార్చి 22: పోంన్జీ స్కాంకు సంబంధించి మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఈడీ గురువారం తనిఖీలు చేపట్టింది. ఈ కుంభకోణంలో మొత్తం రూ.600 కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు, మాజీ అధికారి గురురామ్ సింగ్, న్యాయవాది పునీత్ శర్మ, మరో వ్యక్తికి చెందిన చండీగఢ్, మొహాలీ ప్రాంతాల్లోని ఇళ్ళలో తనిఖీలు నిర్వహించారు. పోంజీ కేసులో సింగ్ విచారణాధికారిగా పనిచేశారు. గత ఏడాది జనవరిలో ఆయన ఈడీ నుంచి రిలీవ్ అయ్యారు. చండీగఢ్ జోన్‌కు సంబంధించి మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన సింగ్, లాయర్ శర్మ సహాయంతో రూ.4-6 కోట్ల వరకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి మరిన్ని ఆధారాల సేకరణకోసమే ఈ దాడులు జరిపామని అధికార్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది ఈడీ అధికార్లు పరారీలో ఉన్న చిట్‌ఫండ్ ఏజెంట్‌ను అరెస్ట్ చేశారు.