కృష్ణ

మైలవరంలో హోదా ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, మార్చి 22: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన నిరసన దీక్షలు, రాస్తారోకోలతో మైలవరం హోరెత్తింది. వైసీపీ, జనసేన, వామపక్షాలు, అఖిలపక్షం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేశారు. వైసీపీ జాతీయ రహదారిని దిగ్భందించింది. ప్రత్యేక హోదా వచ్చే వరకూ కేంద్రం మెడలు వంచే వరకూ ఆందోళన చేస్తామని పలువురు నాయకులు స్పష్టం చేశారు. కాగా టీడీపీ, వైసీపీ నాయకులు మాత్రం ప్రత్యేక హోదాపై పోరాటాన్ని తామే చేస్తున్నామని ప్రకటించుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రజల్లో మైలేజీ కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రయత్నించారు. ఈకార్యక్రమాల్లో టీడీపీ నుంచి కోమటి సుధాకరరావు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, తాతా పోతురాజు, సర్పంచ్ నందేటి కృష్ణవేణి, జెడ్పీటీసీ దొండపాటి రాము, యలమంచిలి శ్రీనివాసరావు, మైక్ బాబూరావు పాల్గొనగా, వైసీపీ నుంచి పామర్తి శ్రీను, రహీం, కరీం, రవూఫ్, నాగిరెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ-మచిలీపట్నం రహదారి దిగ్బంధం
పెడన, మార్చి 22: ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఇచ్చిన పిలుపు మేరకు పెడన నియోజకవర్గంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనం గురువారం విజయవంతంగా జరిగింది. బైపాస్ రోడ్డు వద్ద వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రహదారి దిగ్భంధనం జరిగింది. బంటుమిల్లి నుండి మచిలీపట్నం వెళ్లే రహదారి, గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారి కలిసిన కూడలిని దిగ్బంధించారు. దాదాపు గంట పాటు నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. రెండు వైపులా కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. బందరు డీఎస్పీ మహమ్మద్ భాషా ఆధ్వర్యంలో పలువురు ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌తో పాటు ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, సీనియర్ నాయకులు వనె్నంరెడ్డి మహంకాళరావు, డా. సీహెచ్‌వి అప్పారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పని చేస్తామన్నారు.