కృష్ణ

మహిళల ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మార్చి 22: కుటుంబ వికాసానికి మహిళల ఆరోగ్యం బాగుండాలని, వారి ఆరోగ్యమే సమాజ ఆరోగ్యమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. గురువారం స్థానిక తాలూకా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆరోగ్యదీప్తి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్య భద్రతపై ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన మన జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా నమోదు కావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.