కడప

టాటా బెలూన్ పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 6: ముందస్తుగా వాతావరణంలో వచ్చే మార్పులను పసిగట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో సాంకేతిక పరికరాలతో కూడిన బెలూన్‌ను ఫిబ్రవరి మూడవ వారంలో పంపనుంది. మే 31వ తేది వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్ర, కర్నాటక, మహారాష్టల్ల్రో ఎక్కడైనా ఈ బెలూన్ కనిపిస్తే సమాచారం అందించాలని సంబంధిత శాస్తవ్రేత్తలు కోరారు. ఈ బెలూన్ 30కి.మీ.నుంచి 42కి.మీ. ఎత్తుకు పంపి పరిశోధనలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ శాస్తవ్రేత్త బి.సునీల్‌కుమార్ తెలిపారు. 200 నుంచి 300 కి.మీ.దూరంలో మూడురాష్ట్రాల్లో ఎక్కడైనా బెలూన్ దిగే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఈ బెలూన్ దిగవచ్చని టాటా సైంటిస్టులు పేర్కొన్నారు. సాంకేతిక పరికరాలతో కూడిన ఈ బెలూన్ ఆకాశం నుంచి కిందకు చేరేటప్పుడు చూసిన వారు తెరవకుండా అందులో పొందుపరచిన టెలిఫోన్ నెంబర్ లేదా టెలిగ్రామ్ చిరునామాకు తెలియజేయాలని, అలాగే సమీప పోలీసుస్టేషన్, పోస్ట్ఫాసు, లేదా ప్రభుత్వ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని వారు కోరారు బెలూన్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవడానికి ప్రయత్నించరాదని, అది తెరిస్తే దానిలోని హైవోల్టేజి విద్యుత్ పరికరాలు ప్రమాదకరమని సూచించారు. బెలూన్ తెరవకుండా ఉంచితే ఎటువంటి ప్రమాదాలు జరగవన్నారు. బెలూన్ పడిన చోట కనుగొని తెరవకుండా తెలియపరచిన వ్యక్తికి టాటా సంస్థ పారితోషికం అందజేస్తుందన్నారు. ఈ బెలూన్‌లో నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం, గ్యాస్‌లు నింపి చిన్నపాటి బాక్సును ఏర్పాటుచేసి రేడియో ట్రాన్స్‌మిషన్ రిసీవర్‌ను అమర్చారు. బెలూన్ పరిశోధన ద్వారా ఉష్ణోగ్రత, గాలిలో తేమశాతం, గాలిలో వేగం, వాతావరణ పీడనం , ముందస్తు వర్షంపై సమాచారం తెలుసుకోవడానికి దోహదపడుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏటా 2వేల బెలూన్‌లు అంతరిక్షంలోకి ఆయా దేశాల కాలమానం ప్రకారం తెల్లవారు జామున 5.30గంటలకు కానీ, సాయంత్రం 5.30గంటలకు కానీ బెలూన్‌ను పంపనున్నారు. బెలూన్‌ల సహాయంతో కనుగొన్న అంశాలను వాతావరణ పరిశోధన కేంద్రాలకు చేరవేస్తారు. బెలూన్ దిగే సమయంలో పగిలిపోయినా, అలాగే ఉన్నా సమాచారం అందజేస్తే ఆ బెలూన్‌కు అమర్చిన బాక్సు తిరిగి వాతావరణ పరిశోధనకు ఉపయోగించుకోవచ్చునని అంతరిక్ష శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వదలనున్న బెలూన్ పరిశోధనలకు ప్రజలు సహకరించాల్సిందిగా శాస్తవ్రేత్తలు కోరారు.