Others

గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాంతం ఏకాంతమంటూ
ముద్దుగా పిలుచుకునే ఒంటరితనమెందుకో
ఒకోసారి మారం చేస్తుంది
నిజాల లెక్కలు తేల్చాల్సిందేనని
అహానికి ఎదురుతిరుగుతుంది

బాహ్యానికి అంతరాళానికీ మధ్య
అడ్డుగోడలా నిలబెట్టిన నిర్లిప్తత
ఇక వల్లకాదంటూ చేతులెత్తేస్తుంది
లోలోన నీలపు బరువు ఉవ్వెత్తున పొంగుతుంటే

ఖాళీతనమేలెమ్మని రాజీపడిన
ఓ అలజడి మళ్లీ రాజుకుంటుంది
శూన్యానివి కాదుపొమ్మంటూ
ఒక్క ఆకుకైనా ఖాళీ చూపలేని
ఓ మృత్యుఛాయవంటూ నిందిస్తుంది

స్వగతమొకటి రెండుగా చీలి
రెండు భిన్నమైన నన్ను’లను
నాకు పరిచయం చేస్తుంటే
ఎప్పటికప్పుడు దారితప్పనివ్వని ఓ నిస్సహాయత..
దోషినని అంగీకరించేస్తుంది
దిగంతాల వైపు భరోసాగా చూసుకుంటూ

అప్పుడప్పుడూ ఎందుకో మరి
ఇలా ఓ పరిపూర్ణత సంధించిన
ఏకాకితనం
మనసుని గురిచేసుకుంటుంది
నవ్వొకటి మరలా ఇష్టమయ్యేంత వరకూ..

- స్వాతిసాయ యాకసిరి