ఐడియా

ఉసిరి పచ్చడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజనంలో మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. పరగడుపున కాసిన్ని ఉసిరికాయ ముక్కలు నోట్లో వేసుకుని, మజ్జిగ తాగితే భోజనం ఆలస్యమైనా శరీరానికి శక్తి లభిస్తుంది. ఇందులోని విటమిన్-సి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే మూత్రకోశంలో మంట, నొప్పి తగ్గి మూత్రవిసర్జన సక్రమంగా అవుతుంది. ఉసిరితో ఆవకాయ, తొక్కుడుపచ్చడి వంటివి చేసుకోవచ్చు. కొందరు వీటితో వడియాలు కూడా పెట్టుకుంటారు. ఉసిరిక చెట్టు వేరు నుంచి రసం తీసి కషాయంలా తాగితే దాహాన్ని హరిస్తుంది. ఆ కషాయంలో మెంతులు కలిపి తీసుకుంటే మధుమేహం వంటి రోగాలు తగ్గుతాయి. ఉసిరి చెట్టు కలపకు నీటిని శుభ్రం చేసే గుణం వుంది. అందుకే దీని కలపను పూర్వం నూతుల్లో అడుగు భాగంలో వేసే చట్రాలకు వాడేవారు. ఉసిరి ఆకుల రసాన్ని అత్తరు పరిశ్రమలో విరివిగా వాడతారు. ఉసిరి ఆకుల్ని మెంతులతో కలిపి కషాయం కాచి దీర్ఘకాలిక మూర్ఛవ్యాధికి విరుగుడుగా ఇస్తారు. ఉసిరి గింజలు వాత, పిత్త శే్లషాలను, మూల వ్యాధులను పోగొడుతాయ. జీర్ణశక్తికి ఉసిరి ఉపయోగపడుతుంది.
*