ఆరోగ్య భాగ్యం

బాలికల సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్యావస్థ దాటి కౌమార దశలోకి, ఆ తర్వాత యవ్వనం లోకి అడుగుపెట్టే సమయంలో బాలికల్లో చాలా శారీరక మార్పులు, కొన్ని మానసిక మార్పులు రావడం సహజం. తల్లులు, అక్కచెల్లెళ్ళు లేదా స్నేహితుల సహాయంతో వీరు తమలోని మార్పులను అర్థం చేసుకుని పెరుగుతారు. కొద్దిమంది మాత్రం కొన్ని రకాల శారీరక సమస్యలను ఎదుర్కొంటారు.
బాలికలకు సహజంగా తొమ్మిదేళ్ల వయసు నుంచి 12, 13 సంవత్సరాల వయసు లోపు ‘ప్యూబర్టీ’ అనే మార్పు రావాలి. ఇది ఒక రోజులో రాదు. కొన్ని వారాలు లేక నెలలు- ఒకటి, రెండు సంవత్సరాలు కూడా పట్టవచ్చు. శరీరంలోని ‘ఎండోక్రయిన్’ గ్రంథులు పెరిగి పక్వదశకి రావడంతో వక్షోజాల పెరుగుదల, ముఖ్యంగా జననేంద్రియాల వద్ద రోమాలు పెరుగుతాయి. ఇంచుమించు అదే సమయంలో గర్భాశయం, అండాశయం కూడా పరిపక్వమవుతాయి కనుక నెల నెలా ఋతుస్రావం ఆరంభం అవుతుంది. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఈ మార్పులు వస్తే వైద్య పరిభాషలో ‘ప్రికోషియస్ ప్యూబర్టీ’ అంటారు. ఈస్ట్రోజన్ హార్మోను ఉత్పత్తి కావడంతో పాపలో పెరుగుదల అంటే ఎముకల పెరుగుదల ఆగిపోతుంది. పొడుగు పెరగాల్సిన బాలిక పొట్టిగానే ఉండిపోతుంది. అందుకే దీనికి వెంటనే తగిన వైద్య చికిత్స అవసరం.
17 ఏళ్ల వయసు వరకూ పొడుగు వేగంగాను, 25 ఏళ్ల వయసు వరకూ నెమ్మదిగాను ఎముకల పొడవు పెరుగుతుంది. కాబట్టి తమ ఆడపిల్లలని గమనిస్తూ తల్లిదండ్రులు డాక్టర్ని- ముఖ్యంగా స్ర్తి వైద్య నిపుణులను సంప్రదించి పాప తగిన పొడవు పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఊబకాయం రాకుండా ఆహార విషయాలలో జాగ్రత్త అవసరం.
అలాగే 16-17 సంవత్సరాల వయసు వరకూ రుతుస్రావం మొదలవకపోయినా, శరీరంలో సహజంగా రావాల్సిన మార్పులు రాకపోయినా కూడా వైద్య నిపుణుల చికిత్సలు, సలహాలు అవసరం. ఆధునిక వైద్యరంగంలోని పద్ధతులు, పరీక్షలు- ఉదా- స్కానింగుల ద్వారా గర్భసంచి, ఓవరీలు ఉన్నాయా? లేదా? అవి పెరిగే అవకాశం ఉందా? అన్నది వైద్య పరీక్షల ద్వారా తెలుస్తుంది.
ఎదిగే వయస్సులో బాలికలలో స్వతంత్ర భావాలు, మొండి పట్టుదలలు కూడా సహజమే! కుటుంబ సభ్యుల సహకారం, తల్లిదండ్రులలో అర్థం చేసుకుని బుజ్జగించే ఓపిక వుంటే ఆడపిల్లలు సులభంగా ఈ దశ దాటేస్తారు. ఆరోగ్య విషయాలే కాదు, అలవాట్లకు సంబంధించి కూడా పిల్లలకు సరైన పద్ధతులను నేర్పించాలి. వారికి అవసరానికి మించిన పాకెట్ మనీ, ఖరీదైన సెల్‌ఫోన్లు, టూ వీలర్స్ వంటివి ఇస్తే వాళ్లు చదువుపై కాక ఇతర విషయాలపై దృష్టి సారించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆడపిల్లల ఆరోగ్యం, చదువుకు సంబంధించి తల్లులు దృష్టి సారించాలి.

*

డా. కె.సరోజినీ దేవి, ఎం.డి, డిజివో