మహబూబ్‌నగర్

కోయిల్‌సాగర్ నీరు.. ఆయకట్టు రైతుల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, ఏప్రిల్ 9: నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యేకు ఇసుక రీచులపై ఉన్న శ్రద్ధ రైతులు, ప్రజల పట్లగాని లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండల పరిధిలోని డొకూర్, మీనుగోనిపల్లి, జీన్గురాల, బస్వాయపల్లి, చౌదర్‌పల్లి, హజీలపూర్, లక్ష్మీంపల్లి, తదితర గ్రామాల్లో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే సీతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన గ్రామాల్లో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పాలకులు అభివృద్ధిని మరచి ఇసుక రీచులకు అలవాటు పడి ఈ ప్రాంత ప్రకృతి వనరులను దోచుకుతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోయిల్‌సాగర్ ప్రాజెక్టుపై దేవరకద్ర, చిన్నచింతకుంట, మరికల్, ధన్వాడ మండల ఆయకట్టు రైతులకు మాత్రమే హక్కు ఉందన్నారు. ప్రాజెక్టు కింద ఎకరా ఎండిన ఊరుకోబోమని హెచ్చరించారు. 5వ విడుత సాగునీరు 5రోజులకు బదులు 8 రోజులు వదలాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్, అధికారులు పర్యవేక్షించి పంటలు ఎండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతమ్మ, టీడీపీ నాయకులు సిద్దార్థరెడ్డి, జగదబిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆది హన్మంత్‌రెడ్డి, సత్యన్న, నాగరాజు, హన్మంత్‌రెడ్డి, నాగయ్యశెట్టి, కుర్వరవి, మోహన్‌రెడ్డి, ఎక్‌బాల్‌పాష, కుర్వ రవి పాల్గొన్నారు.

ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి
- ఎస్పీ రెమా రాజేశ్వరి
గద్వాల, ఏప్రిల్ 9: గ్రీవెన్స్‌డే సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, నేరుగావారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం గద్వాల ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు 16 ఫిర్యాదులు అందాయి. భూ వివాదాలకు సంబంధించినవి ఏడు, కుటుంబ గొడవలకు సంబందించి రెండు, కుటుంబ సమస్యలకు సంబంధించి మూడు, గొడవలకు సంబంధించి ఒకటి, ఇతర అంశాలపై మూడు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారుల సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు వెంటనే వారి సమక్షంలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

జనసమితి ప్రజలకు టానిక్ లాంటిది
- తెలంగాణ జనసమితి నేత కల్వకుర్తి ఆంజనేయులు
కల్వకుర్తి, ఏప్రిల్ 9: తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలనను చూసి విసిగిపోయిన ప్రజలకు తెలంగాణ జనసమితి టానిక్‌లాగా పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుర్తి ఆంజనేయులు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ అతిధిగృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దొరల గడీల పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం దగ్గర పడిందన్నారు. రాష్ట్రంలో గడపగడపకు, ఇంటింటికి తెలంగాణ జనసమితిని తీసుకెళ్తామన్నారు. విద్యార్థులంతా జనసమితికి వానర సైన్యంలా పనిచేస్తామని అన్నారు. ఈనెల 29న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేఏసీ నాయకులు సదానందం గౌడ్, శేఖర్, ఓయూ జేఏసీ నాయకులు బాలరాజు, వెంకటేష్, రమేష్, ప్రహ్లాద్, పవన్, హరిబాబు, విద్యార్థి నాయకులు తదితరులు ఉన్నారు.