మహబూబ్‌నగర్

సిద్ధాపూర్ పాఠశాల స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఏప్రిల్ 9: సిద్ధాపూర్ ఆశ్రమ పాఠశాల స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీ్ధర్ ఆశ్రమ పాఠశాలకు చేరుకొని అగ్ని ప్రమాదం జరిగిన స్టోర్‌రూంలోకి వెళ్లి మంటల్లో కాలిపోయిన విద్యార్థుల పరుపులు, నిత్యవసర సరుకులను పరిశీలించారు. పరీక్షల సమయంలో విద్యార్థులను కంటికి రెప్పల చూసుకోవాల్సిన హెచ్‌ఎం లింగయ్య విధులపట్ల నిర్లక్ష్యం వహించి అగ్ని ప్రమాదంకు కారణమైనందుకు హెచ్‌ఎం యు. లింగయ్యను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీ్ధర్ ప్రకటించారు. వివరాల్లోకి వెళ్లితే మండల పరిధిలోని సిద్ధాపూర్ ఆశ్రమ పాఠశాలలో 150 మంది విద్యార్థినీ విద్యార్థులు అక్కడే వుండి విద్యనభ్యసిస్తున్నారు. పరీక్షలు ఉండడంతో ఉదయం ఐదుగంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి సన్నద్ధం అవుతుండగా స్టోర్ రూం నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ కలెక్టర్ శ్రీ్ధర్‌కు సమాచారం అందించారు. అగ్ని మాపకశాఖ సిబ్బంది వచ్చి నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఆర్‌ఐ రాములు ఆశ్రమ పాఠశాలకు చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. మద్యాహ్నం 12 గంటలకు సిద్ధాపూర్ ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న కలెక్టర్, డీటీడబ్ల్యూ ప్రియాంక, ఐటీడీఏ పీఓ డాక్టర్ వెంకటయ్య, ఆర్డీఓ అమరేందర్, తహశీల్దార్ పాండునాయక్‌లతో సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంఘటన జరిగిన తీరును విద్యార్థులను, అగ్ని మాపక, ఎలక్ట్రిసిటీ, పోలీస్‌శాఖ వారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ శ్రీ్ధర్‌తో విద్యార్థులు మాట్లాడుతూ తమకు గత వారం రోజుల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని దాని వల్ల నీటి సమస్య అధికమైందని తెలిపారు. హెచ్‌ఎం లింగయ్య తమను పట్టించుకోవడం లేదని వారానికి ఒకసారి మాత్రమే వచ్చి వర్కర్లకు సరుకులు ఇచ్చిపోతారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంలేదని విద్యార్థులు కలెక్టర్‌కు విన్నవించారు. రాత్రి పూట తమకు భయమవుతుందని తమతోపాటు ఎవరు ఉండడం లేదని వాపోయారు. అనంతరం కలెక్టర్ శ్రీ్ధర్ విలేఖర్లతో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాద విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుం టామని స్పష్టం చేశారు. దాదాపు రూ.6.75 వేల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 141 విద్యార్థులకు పంచాల్సిన పరుపులు, రగ్గులు, 50 కిలోల బియ్యం , సేమియాలు, బఠానీలు నిత్యావసర సరుకులు మంటలో కాలిబుడిదైయ్యాయని కలెక్టర్ వివరించారు. నిబంధనల ప్రకారం ప్రతిరోజు ఒక రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఒక సీఆర్‌టీ రాత్రిళ్లు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉండాలని ఉన్న ఇక్కడ పాటించడం లేదని తేలిందన్నారు. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిన హెచ్‌ఎం లింగయ్యను విధుల నుండి సస్పెషన్ చేస్తున్నామని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు కలెక్టర్‌తో మాట్లాడుతూ హెచ్‌ఎం లింగయ్య సక్రమంగా పని చేయడం లేదని విద్యార్థుల సమస్యల పట్ల శ్రద్ధ వహించడం లేదని ఫిర్యాదు చేశారు. అచ్చంపేట నుండి వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చిపోతారని గతంలో ఆరు క్వింటాళ్లు అక్రమంగా హాస్టల్ బియ్యాన్ని తరలించారని, కేసు కోర్టులో నడుస్తుందని తెలిపారు. మళ్లి విద్యార్థులకు సరఫరా చేస్తున్న సరుకులన్నింటిని మాయం చేసి కావాలనే స్టోర్ రూంకు వర్కర్ శ్రీనుతో నిప్పంటి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అమరేందర్, డీటీడబ్ల్యూఓ ప్రియాంక, ఏటీడబ్ల్యూఓ నర్సింహరెడ్డి, ఆర్‌ఐ రాములు, వీఆర్‌ఓ ఆంజనేయులు, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ హుస్సేన్, డాక్టర్ శ్రీ్ధర్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.