మహబూబ్‌నగర్

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఏప్రిల్ 9: భారతదేశ స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్మృతివనంలో స్మారక స్థూపం వద్ద 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన గద్వాల ఉద్యమకారులకు ఆయన నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఒక పార్కు ఆవశ్యకత ఎంతో అవసరమని గ్రహించి మున్సిపల్ శాఖ సహకారంతో ఈ స్మృతివనం పార్కును ఏర్పాటు చేయడం, ఇందులోనే తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం ఒక స్థూపాన్ని నిర్మించామన్నారు. ఈ పార్కు ఏర్పడిన తర్వాత ఈ జిల్లా నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చేసి 1969 ఏప్రిల్ 9న అమరులైన దివంగత పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్‌లు నేటికీ 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని, వారిని స్మరించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ పార్కులో చనిపోయిన వారికి గుర్తుగా వారి పేరున చెట్లునాటి వాటి సంస్మరణ బాధ్యత తీసుకుంటే ఆ చెట్టుకు నామకరణం చేయడం జరుగుతుందన్నారు. తద్వారా పార్కుకు కూడా ఆదరణ పెరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం నాయకుడు మోహన్‌రావు మాట్లాడుతూ కలెక్టర్ ప్రత్యేక దృష్టి వహించి ఈ స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా పార్కుకు అమరవీరులు సర్వారెడ్డి, వేణుగోపాల్ పేర్లు పెట్టాలని కలెక్టర్‌ను కోరారు. హరితహారంలో పండ్ల మొక్కలు ఇస్తే స్మృతివనంలో నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యమకారులను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, మార్కెట్ యార్డు చైర్మన్ బండ్ల లక్ష్మిదేవి, గ్రంథాలయ చైర్మన్ బీఎస్ కేశవ్, పీసీసీ రాష్టక్రార్యదర్శి గడ్డం కృష్ణారెడ్డి, ఉద్యమకారుల సంఘం నేతలు కృష్ణమూర్తి, మోమిన్, వెంకటస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆనంద్, పూడూరు చిన్నయ్య, గోవిందు, అతికూర్ రహిమాన్, నాగన్‌గౌడు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

సర్వంగా సుందరంగా రైతు బజార్
- పాత ఇరిగేషన్ కార్యాలయ స్థలంలో ఏర్పాటుకు చర్యలు
- ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, ఏప్రిల్ 9: పట్టణ నడిబొడ్డులోని పాత ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఉన్న స్థలంలో సర్వంగా సుందరంగా రైతుబజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఇరిగేషన్ డీఈ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. పాత ఇరిగేషన్ భవన్‌ను స్థలంలో ఉన్న పాత భవనాలను కూల్చి రైతుబజార్ ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నామన్నారు. అందుకుగాను జీఓ నంబర్ 571 ద్వారా ఉత్తర్వులు అందయన్నారు. ఇరిగేషన్ శాఖ నుండి మార్కెటింగ్ శాఖకు భూమిని ప్రజల సౌకర్యార్థం బదాలయించామని తెలిపారు. రెండు శాఖలకు ఒకే మంత్రి ఉండడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజీవ్‌నగర్‌కాలనీలో 15 ఎకరాల స్థలంలో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. హిందు శ్మశాన వాటికకు రూ.కోటితో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటమన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.