నిజామాబాద్

అంకుల్ జిల్లాకు చేసిందేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్/బోధన్ రూరల్, ఏప్రిల్ 9: వయస్సులో పెద్దవారైనా తాను అంకుల్‌గా పిలువబడే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ జిల్లాకు చేసిందేమి లేదని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం రాత్రి బోధన్‌లో జరిగిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ నీటిపారుదల శాఖా మంత్రిగా ఐదేళ్ల పాటు పనిచేసిన ఆయన రైతుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తాము ప్రస్తుతం రైతుల కోసం సాగునీటి కాలువలు అభివృద్ధి చేశామని, అలాగే రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఇస్తుండటంతో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెరాస ఇచ్చినటువంటివన్నీ తీసుకొని ఇవ్వని వాటి గురించి నిలదీయండి అని రైతులకు తెలియచేస్తున్నారని ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు. చిల్లర, మల్లర రాజకీయాలకు స్వస్తి పలకాలని ఎంపీ సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను గుర్తించాలి కానీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దన్నారు. గాంధీ బొమ్మను అడ్డం పెట్టుకుని కాంగ్రేస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారని దుయ్య బట్టారు. నిజాంసుగర్స్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మైనార్టీలకు సర్కారు పెద్దపీట వేసిందని వివరించారు. తాను బోధన్ నియోజకవర్గ కోడలుగా తాను జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానని వివరించారు.
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
పట్టణంలో 67 కోట్ల రూపాయలతో జరుగనున్న నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ పనులకు భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావ్ శంకుస్థాపన చేశారు. అలాగే రాకాసిపేట్‌లో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావ్, సబ్‌కలెక్టర్ అనురాగ్ జయంత్, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, తెరాస నాయకులు బుద్దె రాజేశ్వర్, దేశాయ్, ఆబిద్, ధూప్‌సింగ్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.

మంత్రి రాక పుణ్యమా అని
మోర్తాడ్, ఏప్రిల్ 9: రబీ సీజన్‌లో వేసిన పంటలకు అవసరమయ్యే సాగు జలాలను అందించేందుకు హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా అధికారులు సోమవారం మరోసారి నీటిని విడుదల చేశారు. వాస్తవానికి పక్షం రోజుల క్రితమే నీటిని విడుదల చేసినప్పటికీ, ఆ కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేసిన విషయం విధితమే. లక్ష్మికాల్వ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల జరుగుతూనే ఉన్నా, అదే కాల్వపై నిర్మించిన హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం నుండి నీటి విడుదలపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈసారి రబీ సీజన్‌లో మూడు, నాలుగు రోజులు మినహా చెరువులకు హన్మంత్‌రెడ్డి ద్వారా అధికారులు నీటిని విడుదల చేయలేదు. పక్షం రోజుల క్రితం పంప్‌హౌజ్‌ను ప్రారంభించి నీటి విడుదల చేయడంతో చెరువులకు కొంతమేర జలాలు అందాయి. ఆ తర్వాత ఆకస్మాత్తుగా నీటిని నిలిపివేశారు. ఇక నీటి విడుదల జరుగదేమోనని అనుకున్న సమయంలో సోమవారం ఒక్కసారిగా నీటిని విడుదల చేశారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ.హరీశ్‌రావు పర్యటన నిజామాబాద్ జిల్లాలో ఉన్నందునే ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసి ఉంటారని రైతులు అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ, మంత్రి పర్యటన పుణ్యమా అని చెరువులకు నీరు రావడం పట్ల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.