తెలంగాణ

కులవృత్తిదారుల జీవితాల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 9: రాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెపిల్లలకు ఉచితంగా దాణా పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ గ్రామంలో శ్రీకారం చుట్టింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గొర్రెలకాపరులకు ఉచితంగా దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా 2.69 లక్షల యూనిట్లకు పంపిణీ చేసినట్టు చెప్పారు. ప్రతి యూనిట్‌లోని ప్రతి గొర్రె పిల్లలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగానే దాణా ఇవ్వాలని నిర్ణయించామని అది మహబూబ్‌నగర్ జిల్లా నుండే శ్రీకారం చుట్టామని అన్నారు. దాణా పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా రూ.66.80 కోట్లు నిధులు కేటాయించినట్టు చెప్పారు. వందశాతం ఉచితంగానే పంపిణీ చేస్తామని అన్నారు. పంపిణీ చేసిన గొర్రెలు మహబూబ్‌నగర్ జిల్లాలో 2112 చనిపోయావని అందుకు తిరిగి మళ్లి 1060 గొర్రెపిల్లల ను పంపిణీ చేశామన్నారు. గొర్రెలకాపరులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. 35 లక్షల జనాభా గల కుర్వ, గొల్లయాదవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కుర్వ, గొల్లయాదవుల గురించి ఎవరు పట్టించుకోలేదని కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉద్యమనాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నందునే కులవృత్తుల వారి గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలు సాగులోకి రావడంతో పాలమూరు జిల్లా పచ్చబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్