తెలంగాణ

రైతుల నుంచి ఏటా 7 వేల కోట్ల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: రసాయన పురుగు మందులను విదేశాల నుండి దిగుమతి చేసి, భారత్‌లో అధిక ధరకు విక్రయిస్తున్న బహుళజాతి సంస్థల (ఎంఎన్‌సీలు) వల్ల రైతులు ఏటా దాదాపు ఏడువేల కోట్ల రూపాయల దోపిడీకి గురవుతున్నారంటూ భారత్‌లోని చిన్నతరహా రసాయన పురుగుమందుల ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య (కప్మా) ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్‌లోకి దిగుమతి అవుతున్న ఎంఎన్‌సీల ఉత్పత్తుల టెక్నికల్ గ్రేడ్ మెటీరియల్‌ను భారతప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేయకుండా విక్రయిస్తున్నారని ఆరోపించారు. కప్మా అధ్యక్షుడు ఎం. రాజమహేందర్‌రెడ్డితో పాటు ఇతర సంఘాల ప్రతినిధులు సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎంఎన్‌సీలకు అనుకూలంగా రూపొందించిన ది ఫెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్లు- 2017ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ బిల్లులో అనేక లోపాలున్నాయన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఫెస్టిసైడ్స్ ఇన్‌స్పెక్టర్ల ఇష్టారాజ్యం మొదలవుతుందని, వీరి నిర్ణయాలపై అప్పీల్ చేసుకునేందుకు అప్పిలేట్ అథారిటీని ఏర్పాటు చేయకపోవడం పెద్దలోపమన్నారు. ఫెస్టిసైడ్స్ ఇన్‌స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వారి అక్రమాలకు లొంగని స్థానిక ఫెస్టిసైడ్ కంపెనీలపై చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద పెనాల్టీలు వేసే అవకాశం ఉందన్నారు. ఎంఎన్‌సీలు విదేశాల నుండి దిగుమతి చేసే రసాయన పురుగుమందులను నియంత్రించాల్సి ఉందని మహేందర్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న చట్టం ప్రకారం ఎంఎన్‌సీలు తమ ఉత్పత్తుల టెక్నికల్ గ్రేడ్ మెటీరియల్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2007లో తీసుకువచ్చిన నిబంధనలను ఉపయోగించుకుని ఎంఎన్‌సీలు భారత రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విధానం కొత్త బిల్లులో కూడా యథాతథంగా అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంఎన్‌సీలు, స్థానిక చిన్న తరహా పరిశ్రమలు చేస్తున్న ఉత్పత్తుల ధరలను పోలుస్తూ పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజమహేందర్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు.
అసెటామిప్రిడ్ 20 శాతం ఎస్‌పి ధరను లీటర్‌కు ఎంఎన్‌సీలు 6380 రూపాయలుగా నిర్ణయించగా, భారత్‌లోని చిన్న కంపెనీలు 800 రూపాయలకే విక్రయిస్తున్నారని గుర్తు చేశారు. ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 శాతం ఎస్‌జిని ఎంఎన్‌సీలు లీటర్‌కు 8000 రూపాయలకు విక్రయిస్తుండగా, భారత్ కంపెనీలు 3,600 రూపాయలకే విక్రయిస్తున్నాయన్నారు. ఇతర ఉత్పత్తుల ధరలు కూడా ఇలాగే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెక్నికల్ గ్రేడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ యా ఉత్పత్తులను దేశంలోకి దిగుమతి చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా,యూరోప్, బ్రెజిల్, చైనా తదితర దేశాలు తమ దేశాల్లో ఫార్ములేషన్ నమోదు చేయకపోతే ఎలాంటి ఉత్పత్తులను కూడా దేశంలోకి అనుమతించడం లేదన్నారు.
ఇదే విధానం భారత్‌లో కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఫెస్టిసైడ్స్ మ్యానుఫాక్చరర్స్ అండ్ ఫార్ములేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రదీప్ దావే, ఫెడరేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సౌత్) అధ్యక్షుడు ఎం. మురళి, తెలంగాణ, ఏపీ పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (తాప్మా) అధ్యక్షుడు వై. నాయుడమ్మ, రైతుసంఘాల ప్రతినిధులు జైపాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, రవిప్రకాశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న ఫెస్టిసైడ్స్ పరిశ్రమల ప్రతినిధి ప్రదీప్ దావే