కర్నూల్

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 8:జిల్లాను గత నెలలోనే ఓడీఎఫ్‌గా ప్రకటించినప్పటికీ పురోగతిలో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించలేదని, వెంటనే పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ఓడీఎఫ్, ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించినప్పటికీ ఇంకా 13,389 వ్యక్తిగత మరుగుదొడ్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ అంశంపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రశ్నిస్తారని వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోలను ఆదేశించారు. అలాగే ఆలూరు, హాలహర్వి, తుగ్గలి, పత్తికొండ, ప్యాపిలి, నందవరం, ఎమ్మిగనూరు, మంత్రాలయం, తదితర మండలాల్లో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కావున సంబంధిత అధికారులను పిలిపించి వచ్చే శనివారంలోగా పూర్తి చేయకపోతే సంజాయిషీతో కూడిన నివేదికలు జారీ చేయాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు. వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారి మన్ననలు పొందాలన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి కూలీలు పనులకు హాజరయ్యేలా సంబంధిత ఏపీఓలు బాధ్యత తీసుకోవాలన్నారు. పని చేస్తే గుర్తింపు ఉంటుందని ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా వీఆర్వోలు పనులు చేయాలని సూచించారు. రికార్డులు సరిగ్గా నిర్వహిస్తూ మీసేవా కేంద్రాల ద్వారానే ఆన్‌లైన్ తప్పు, ఒప్పులు సరి చేసుకోవాలన్నారు.

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
* నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి
కర్నూలు సిటీ, ఏప్రిల్ 8:నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి తెలిపారు. నగరంలోని సీ.క్యాంప్ సెంటర్ నుంచి మోక్షగుండం విశే్వశ్వరయ్య సర్కిల్ వరకూ రోడ్డు విస్తరణ పనులతో పాటు గుత్తి రోడ్డు వైపు జరుగుతున్న పనులను ఆదివారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మద్దూర్‌నగర్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా బీటీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. గుత్తి రోడ్డు వైపు ఉన్న డివైడర్ వెడల్పును తగ్గించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మొక్కలకు సకాలంలో నీరందించాలన్నారు.

హోదా కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి
* యువతకు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న పిలుపు
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఏప్రిల్ 8:రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం యువత ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు జి.రామన్న పిలుపునిచ్చారు. స్థానిక కార్మిక కర్షక భవన్‌లో ఆదివారం డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రామన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు 5 కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేశాయని మండిపడ్డారు. అలాగే యువతను నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, వంద రోజుల్లో నల్లధనం తిరిగి తెస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు నల్లబకాసురలను రక్షిస్తున్నాడని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు యువతను పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇక రాయలసీమలో జిల్లాల్లో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, దీని కోసం యవత పెద్దఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.