పఠనీయం

పానశాల -దువ్వూరి రామిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూలోకం ఒక చదరంగం. మనమే పావులం. రాత్రి పగళ్లే తెలుపు, నలుపు గళ్లు. విధి అనే ఆటగాడు పావులను కదిలిస్తూ ఉంటాడు. క్రమంగా ఒక్కొక్క పావును చంపివేసి సమాధి అనే పెట్టెలో వేస్తాడు అనే భావన ఎంత గొప్పగా వుందో కదా! ఆ భావన రామిరెడ్డిగారి పద్యంలో-
ఇల చదరంగమందు జనులెల్లరు పావులహస్రులున్ నిశల్
తెలుపును నల్పుగళ్లు కదలించును రాజును బంటు దక్కు పా
వుల విధియాటకాదు, పలుపోకల ద్రిప్పును, గళ్లు మార్పు, అ
వ్వల నొకటొక్కటం జరిపి వైచు నగాధ సమాధి పేటికిన్
అని విశే్లషిస్తాడు.
ఉమర్ ఖయ్యాంగారి రుబాయిలు దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల పద్యాలు వేమన పద్యాలవలె ముక్తకాలె.
ఇలా ఎన్నో జీవిత సత్యాలను, తత్త్వాలను, అనుభవసారాలను అలతి అలతి పద్యాలతో మనోహరమైన శైలిలో, సహజమైన కవిత్వంతో వివరిస్తూ పానశాలను మనకందించిన కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు- అనేక గ్రంథాలు అనువదించారు. 1940-41 మధ్య పలితకేశము, కవి-రవి అనే కావ్యాలను కూడా రచించారు. తెలుగు తల్లిని అనేక కావ్యపుష్పలతో అర్చించిన ఈ కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారి మతం- మానవతామతం- విజ్ఞానవాదమే రుూయన ధ్వజం. దువ్వూరి రామిరెడ్డిగారు ఈ శతాబ్దం పూర్వార్థంలో విరాజిల్లిన మహాకవి. వీరు 1947 సెప్టెంబరు 11వ తేదీన అంతిమ విశ్రాంతి తీసుకొన్నారు.
దువ్వూరి రామిరెడ్డి లాంటి కవీశ్వరులు శరీరాన్ని విడిచిపెట్టినా తమ కీర్తి శరీరాలతో ఆచంద్రతారార్కం ప్రకాశిస్తూనే ఉంటారు.
జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశఃకాయే జరామరణజంభయమే.

-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కోట రాజశేఖర్