జాతీయ వార్తలు

‘మార్గదర్శి’ ప్రయోగం రేపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 10: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో క్షేత్రీయ దిక్సూచి (ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం) ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శాస్తవ్రేత్తలు పాల్గొని ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఏబి) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ఈ రాకెట్ ద్వారా 1425 కిలోల బరువుగల స్వదేశీ మార్గదర్శి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం రాత్రి 8 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని నాలుగు, రెండో దశకు ద్రవఇంధనం నింపే కార్యక్రమాన్ని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇంధనంతోపాటు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌ను నింపి రాకెట్ అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కౌంట్‌డౌన్ 32 గంటల నిర్విరామంగా కొనసాగినంతరం రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ నేపధ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ బుధవారం షార్‌కు రానున్నారు. స్వదేశీ నేవిగేషన్ సేవల కోసం ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో మొత్తం 7 ఉపగ్రహాలను ప్రయోగించే విధంగా ప్రణాళిక రూపొందించింది. అదేవిధంగా ఈ సిరీస్‌లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఏ నుంచి జి వరకు మొత్తం ఏడు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారానే విజయవంతంగా రోదసీలోకి పంపారు. నేవిగేషన్ సిరీస్‌లో అన్ని ఉపగ్రహాలు వరుస విజయవంతం కావడంతో నావిక్‌గా నామకరణ చేసి స్వదేశీ నేవిగేషన్ సిస్టం రూపొందించి సేవలు అందేవిధంగా రూపొందించారు. కొంతకాలం తరువాత ఈ సిరీస్‌లో మొదట 2013 జూలైలో పీఎస్‌ఎల్‌వీ-సీ 22 ద్వారా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఏ ఉపగ్రహం సాంకేతిక లోపం తలెత్తి సంకేతాలు అందలేదు. దీంతో దాని స్థానంలో 2017 ఆగస్టులో పీఎస్‌ఎల్‌వీ-సి 40 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ 8వ ఉపగ్రహాన్ని పంపించారు. రాకెట్ విజయవంతంగా నింగిలోకి ఎగిరిన శిఖర భాగాన ఉపగ్రహం చుట్టు ఉండే హీట్‌షీల్డ్ తెరుచుకోకపోవడంతో ఆ ప్రయోగం విఫలమైంది. మళ్లీ దాని స్థానంలో ఆ ఉపగ్రహానికి అనుబంధంగా సీ-41 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ 9వ క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహాన్ని పంపి పూర్తి స్వదేశీ నేవిగేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. మార్చి 29న ప్రయోగించిన జీశాట్-6 ఏ సాంకేతిక లోపం తలెత్తి ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. ఇప్పటివరకు జీశాట్ ఉపగ్రహ సంకేతాలు పునరుద్ధరించలేదు. ఈ వైఫల్యాలను అధిగమించేందుకు ఇస్రోకు ఈ ప్రయోగం ఒక సవాల్‌గా మారింది. ఈ వైఫల్యాల సవాల్‌ను అధిగమించేందుకు ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ 41 ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్తవ్రేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చిత్రం..ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ-సి 41 రాకెట్