శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, ఏప్రిల్ 10: ఎన్నికల ప్రచార సభలలో ప్రత్యేక హోదాతోపాటు అనేక వాగ్దానాలు చేసి ప్రజలను వంచించిన చంద్రబాబుపై ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించాలని వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా కోవూరులో చేస్తున్న రిలేనిరాహార దీక్షలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని ప్రసన్న చేపట్టారు. తొలుత తాలూకాఫీసు సెంటర్ నుంచి పెద్దసంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జాతీయ రహదారిపైకి చేరుకున్న ప్రసన్న ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావటం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. రాష్ట్రానికి హోదా అర్హత వస్తే నూతన రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని దానివల్ల బాబుకు ఒనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవని అదే ప్యాకేజీ అయితే కేటాయించే నిధులలో బాబు పర్సంటేజీలు దండుకుంటారని అందుకే చంద్రబాబు తొలి నుంచి హోదా వద్దు ప్యాకేజి ముద్దు అంటూ లీక్‌లు ఇస్తూ వచ్చారన్నారు. తీరా ఇప్పుడు ప్యాకేజీకి కూడా ఎటువంటి చట్టబద్ధత లేకపోవడంతో యూటర్న్ తీసుకుని ఎన్నికలలో లబ్ధి కోసం ప్రత్యేకహోదాకు జై అంటున్న పచ్చి అవకాశవాది చంద్రబాబు అని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం తొలి నుంచి చిత్తశుద్ధితో పోరాటం చేసింది జగన్ ఒక్కడేనని ఈరోజు కూడా ఢిల్లీలో పోరాటం చేస్తున్నది వైసీపీ అని కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించి తీరుతామని ఈ సందర్భంగా ప్రసన్న స్పష్టం చేశారు. గంటపాటు జరిగిన రహదారుల దిగ్బంధంతో కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, టంగుటూరు మల్లికార్జునరెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, బెజవాడ గోవర్థన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులురెడ్డి, షేక్ అహ్మద్, పుచ్చలపల్లి వెంకటరమణారెడ్డి, చిరంజీవి, మైనుద్దీన్, భాస్కర్‌రెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, ములమూడి సుబ్బరామిరెడ్డి, మధురెడ్డి, సింగారెడ్డి జనార్థన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.