బిజినెస్

వెండి, బంగారం..మరింత ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 11: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పదిగ్రాముల బంగారం ధర రూ.405కు పెరిగి, రూ.31,000 మార్కును దాటింది. బంగారం కొనుగోళ్ల డిమాండ్ పెరగడమే ధర పెరగడానికి కారణం. ఇక వెండి కూడా కిలోకు రూ.415 పెరిగింది. డాలర్ మార్కెట్ రెండువారాల కనిష్టానికి చేరుకోవడంతో బంగారం కొనుగోళ్లవైపు మొగ్గుచూపడం అధికమైందని వర్తకులు చెబుతున్నారు. రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు చోటు చేసుకున్నప్పుడు బంగారం సురక్షితమైందని భావించడం వల్లనే డిమాండ్ పెరుగుతుందని వారు పేర్కొన్నారు. పదిగ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.31,095గాను, స్వచ్ఛమైన బంగారం రూ.31,245 గాను పలికింది. ఇక వెండి కూడా కిలోకు రూ.415 పెరగడంతో, రూ.38,755కు చేరుకుంది.