అంతర్జాతీయం

ప్రణాళిక లేకుండా పట్టణీకరణ ప్రగతికి పెను సవాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, ఏప్రిల్ 11: ప్రణాళిక లేకుండా పట్టణీకర ణ, వలసలు అభివృద్ధికి పెను సవాళ్లుగా భారత్ అభివర్ణించింది. దీనివల్ల ప్రజలకు విస్తృత సేవలు, జీవన ప్రమాణాల మెరుగుదలలో ఏమాత్రం ప్రగతి సాధించలేమని తెగేసి చెప్పింది. ఐక్య రాజ్య సమితి సాధారణ సమావేశాల్లో భారత్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ఈ పరిస్థితిని అధిగమించాలంటే నగరీకరణ, వలసలపై విస్తృత ఒరవడికి మొగ్గు చూపాలని పేర్కొంది. ఐరాస 51వ సాధారణ సమావేశాల్లో భాగంగా జనాభా-అభివృద్ధి అన్న అంశంపై భారత శాశ్వత ప్రతినిథి పౌలోమి త్రిపాఠి ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలో సగం జనాభా నగరాల్లోనే జీవిస్తున్నారని, 2050నాటికి మూడొంతుల జనాభా నగరాల్లో జీవిస్తారన్న అంచనాల నేపథ్యంలో త్రిపాఠి ఈ ప్రకటన చేశారు. ‘తాజా అంచనాల ప్రకారం ఎక్కువ శాతం ప్రజలు పుట్టిన ప్రాంతాలకు దూరంగానే బతుకుతున్నారు.
మానవ చరిత్రలో ఇదో కొత్త పరిణామం. అంతేకాదు, అంతర్జాతీయ వలసవాదులంతా నగరాల్లోనే జీవిస్తున్నారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ శకాన్ని రాజధాని, సాంకేతికత, వస్తుసేవలు, ప్రజలు అన్న పదాలే నిర్వచిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. పల్లెలు పట్టణాల మధ్య జనాభా సమతుల్యత పాటించాలంటే విస్తృతమైన, పటిష్టమైన విధానాన్ని అనుసరించక తప్పదని ఆమె సూచించారు. వలసల కారణంగా విస్తృతమవుతున్న పట్టణాల్లో కొత్త ఆలోచనలు, కొత్త శక్తి, సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తోందని అన్నారు. అయితే ‘ప్రణాళికేతర పట్టణీకరణ, నియంత్రణలేని వలసలు మాత్రం అభివృద్ధికి పెను సవా ళ్లే’నని ఆమె వ్యాఖ్యానించారు.