Others

ఉడ్డీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను అంతగా అహంకరిస్తాడు గానీ
నిజానికి ప్రకృతే గురువని గుర్తించలేడు
రెక్కలు లేని మనిషి
ఆకాశంలో విహరించమంటే
కళ్ళు విప్పితే కరిగిపోయే కలకి కూడా
బలం ఉందనే పాఠం నేర్వడమే!

నిద్రలేని రాత్రుల బాటలో
అతను సంధించిన విమానాస్త్రం
తొలి రూపురేఖల విన్యాసాలు చూస్తుంటే
మనిషికింత భావనాబలాన్ని ప్రసాదించిన
చిన్న పిట్టలకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది

మానవ శరీరాన్ని
మృదువైన ఈకలా మార్చి
గగన విహారం చేయస్తున్న ఘనతనూ
శాస్త్ర సాంకేతిక శౌర్య ప్రతీకలను
పరామర్శిస్తున్నప్పుడు
జలాంతర్గమున వాహికలను వినిర్మించిన
ప్రగతి చోదక శక్తుల్ని పరికించినప్పుడు
లోలోపల ఆనందంతో బాటు
అర్థంకాని అలజడి!
గర్వ గౌరవాలతోబాటు
ఆశ్చర్యభయాలు కూడా!
ఈ సాహసయాత్రలో దారితప్పి
మనిషితనాన్ని మర్చిపోతాడేమోనని!

చిన్నవి పెద్దవి
ప్రయాణించేవి నియంత్రించేవి
నిర్మూలించేవి నిరూపించేవి
రకరకాల శక్తి సంభరిత
లోహవిహంగాలు, మిస్సైల్స్, జలాంతర్గాములు, శాటిలైట్స్
ఆకాశయానంలో పునర్జన్మించిన మానవుడే
మనసు ఆవిరయన మరో యంత్రం
ఎప్పుడైనా ఎక్కడైనా
కలలు మనిషిని ఎదిగించాలి గానీ
ఎగరేసుకుపోకూడదు కదా!

ఎదగటమంటే ఎగరటమా?
తోటివారికి చేతులందీయటం కదా!
కళ్ళున్నందుకు కలలు కనాల్సిందే గానీ
కలలోనైనా ఆ కొత్త ప్రపంచంలో కూడా
మనిషి మనిషిగా మనవలసిందే గదా!

- డాక్టర్ సి. భవానీదేవి, 9866847000