రంగారెడ్డి

క్రికెట్ టోర్నీతో యువతకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 15: నియోజకవర్గంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మండల పరిషత్ అధ్యక్షుడు మర్రి నిరంజన్ రెడ్డి నిర్వహించిన ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఎంఎన్‌ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో నియోజకవర్గ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల నుంచి సుమారు 144 క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. నాకౌట్ టోర్నమెంట్‌గా సాగిన టోర్నీలో ఇబ్రహీంపట్నం చాంపియన్స్ జట్టు విజేతగా, మంచాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. మొదటి బహుమతిగా చాంపియన్స్ క్రికెట్ జట్టుకు రూ.66666 రన్నరప్‌గా నిలిచిన మంచాల జట్టుకు రూ.33333 నగదుతో పాటు షీల్డ్, ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలను స్థానిక నిరంజన్ రెడ్డి అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. టోర్నీని అంతర్జాతీయ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గత నెల 30న ప్రారంభించారు. నాటి నుంచి నిర్విరామంగా టోర్నమెంట్ కొనసాగింది. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. మైదానానికి చేరుకుని క్రీడాకారులకు ప్రోత్సహించారు. నియోజకవర్గ యువతలోనూ క్రీడానైపుణ్యం దాగి ఉన్నదని చాటిచెప్పారు.
టోర్నీ విజయవంతం అవడంతో రానున్న రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఐపిఎల్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకల్లో కమెడియన్లు కిషోర్‌దాస్, చిత్రం శ్రీనుతో పాటు జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేశారు.
క్రీడలకు ప్రాధాన్యం
నియోజకవర్గ క్రీడాకారుల్లో ఎంతో క్రీడా నైపుణ్యం దాగి ఉన్నదని దానిని వెలికి తీసేందుకు తనవంతుగా కృషి చేసినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణతో అందరి చూపు నియోజకవర్గంపై పడేలా చేశామని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక క్రీడాకారులకు ఎన్నో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మండల అభివృద్ధితో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు

ఆమనగల్లు, ఏప్రిల్ 15: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజి ఆచారి అన్నారు. ఆదివారం ఆమనగల్లులో తాలుకా అధ్యక్షుడు మట్ట వెంకటేష్‌గౌడ్ అధ్యక్షతన బీజేపీ సమావేశం జరిగింది. ఆచారి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుంటే జీర్ణించుకోలేని కాంగ్రెస్, కమ్యానిస్టులు మతతత్వవాదులతో చేతులు కలిసి అస్థిరపరిచి లబ్ధిపొందేందుకు నిస్సిగ్గుగా కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతుంటే ఇక్కడి ప్రతిపక్షాలు పార్టీ సిద్ధాంతాలను గాలికి వదిలేసి బీజేపీ పాలిత రాష్ట్రాల పాలనపై దుష్పచారానికి దిగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ వైఖరిని దేశ ప్రజలకు తెలియజేసేందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీ దీక్ష చేపట్టారని చెప్పారు. రాష్ట్రంలోని పేద రైతులకు 50శాతం సబ్సిడీపై టాక్టర్లను కేంద్ర ప్రభుత్వం అందజేస్తే నిస్సిగ్గుగా గూలాబీ పాట పడిన వారికి ఇచ్చారని, ఇదేనా బంగారు తెలంగాణా అని ప్రశ్నించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తు ముఖ్యమంత్రి కేసీఆర్.. వేల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తీసుకుంటూ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి వినియోగించుకుంటున్నారే తప్ప మచ్చుకైనా ఎక్కడా కూడ ప్రచారం చేయడం లేదని దుయ్యబట్టారు.
దోపిడీ రాష్ట్రంలో అవినీతి, అక్రమ సంపాదన ధ్యేయంగా పరిపాలన సాగుతుందని అన్నారు. కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని ఆచారి తెలిపారు.
సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, జడ్పీటీసీ హరిప్రసాద్, వెంకటయ్య, నర్సింహ, పరమేష్ గౌడ్ పాల్గొన్నారు.