హైదరాబాద్

బీబీఎన్ అధ్యక్షుడిగా కరణం నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బ్రాహ్మణ వ్యాపారుల పరస్పర సహకారం కోసం ఏర్పాటైన బ్రాహ్మిణ్ బిజినెస్ నెట్‌వర్క్ (బీబీఎన్) అధ్యక్షుడిగా కరణం నారాయణ ఎన్నికయ్యారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా సేవలు అందిస్తున్న తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు సముద్రాల వేణుగోపాలాచారి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బీబీఎన్ నూతన కార్యవర్గం ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎన్నికైన కరణం నారాయణ మాట్లాడుతూ బ్రాహ్మణ వ్యాపారుల పరస్పర సహకారం కోసం బీబీఎన్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బ్రాహ్మణ పరిషత్ పెద్దల సహాయసహకారాలతో ఏర్పాటైన బీబీఎన్ ప్రతి ఆదివారం సమావేశాలను నిర్వహించుకొని, సభ్యుల మధ్య వ్యాపారం మరింత అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బీబీఎన్‌ను మరింత విస్తృత పరుస్తామని అన్నారు. బీబీఎన్ కేవలం తెలంగాణలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ వ్యాపారుల మధ్య అనుసంధాన పాత్రను పోషిస్తుందని తెలిపారు. వ్యాపార రంగంలో ఉన్న ప్రముఖులతో సమావేశాలు ఏర్పటు చేయడంతోపాటు, మార్కెట్‌లో వస్తున్న మార్పుల గురించి కూడా సభ్యులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీనిని గౌరవంగా భావిస్తున్నానని, అత్యుత్తమ సేవలు అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కేవీఎన్ రావు సభ్యులకు బీబీఎన్ విధివిధానాలను వివరించారు. రానున్న కాలంలో బీబీఎన్‌ను ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చే రీతిలో ఈ విధివిధానాలు ఉన్నాయని అన్నారు. ఒక మంచి ఆశయంతో ఏర్పాటైన బీబీఎన్ చాలా తక్కువ సమయంలోనే ఉన్నతంగా ఎదుగుతుందని, దీని కోసం విధివిధానాల రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్ శర్మ అన్నారు. సభ్యుల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు రాకుండా ఉండేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, బ్రాహ్మణ వ్యాపారులంతా బీబీఎన్ సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
బీబీఎన్ నూతన కార్యవర్గం
అధ్యక్షుడు: కరణం నారాయణ, ఉపాధ్యక్షుడు: కేవీఎన్ రావు, ప్రధాన కార్యదర్శి: డీ. సుధాకర్ శర్మ, సహాయ కార్యదర్శి: వట్టెం రాజ్యలక్ష్మి, కోశాధికారి: అవసరాల విష్ణు, సహాయ కోశాధికారి: స్వాతి, కార్యవర్గ సభ్యులు: సీవీ రమణ, సీ. వెంకటేశ్వర శర్మ, స్వాతి, చతుర్వేతి, అమృత్, పవన్, న్యాయ సలహాదారు: జేఎల్‌ఎన్ మూర్తి, మీడియా బాధ్యతలు: రమా విశ్వనాథ్, బీవీఎల్‌కే మనోహర్, ఉజ్వల్, మాడభూషి.