తెలంగాణ

మతోన్మాదుల కోరలు పీకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: మతోన్మాదంతో రగలి పోతూ దళిత, బహుజన వర్గాలపై దాడులకు తెగబడుతున్న వారి కోరలు పీకాలని సదస్సులో వక్తలు నిర్ణయించారు. సీపీఐ 23వ జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలో ‘ మతోన్మాద రాజకీయాలు-లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల కర్తవ్యం’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. నగర సమితి అధ్యక్షుడు ఇటి నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు హాజరై ప్రసంగించారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలిగిన దేశంలో మతోన్మాదంతో రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. భాషలు, భావాలు, జీవన విధానంతో భిన్నంతో ఏకత్వం కలిగిన దేశంలో మతశక్తుల ఆగడాలను సహించబోమని, వారి కోరలు పీకుతామని హెచ్చరించారు. విద్యా, సాంస్కృతిక రంగంలో మతోన్మాదాన్ని చొప్పంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మతం పేరుతో దుర్మార్గమైన, అనాగరికమైన చర్యలకు పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు. ఇలాంటి దాడులను, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా పోరాటాలు సాగించాలని పిలుపు నిచ్చారు.