తెలంగాణ

అర్హుందరికీ బ్యాంకు ఖాతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అర్హులైన లబ్ధిదారులందరి పేర్లతో బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి ఆదేశించారు. సచివాలయంలో గురువారం జరిగిన రాష్టస్థ్రాయి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, 2017-18 లో 5469 కోట్ల ముద్రా రుణాలను అందించామని గుర్తు చేశారు.
జన్‌ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించాల్సి ఉందని, రూపే కార్డులను జారీ చేయాల్సి ఉందన్నారు. బ్యాంకు మిత్రల పనితీరు, ముద్రా రుణాల పంపిణీ, ఫైనాన్షియల్ లిట్రసీ క్యాంపెయిన్, బీమా యోజన తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అన్ని తరహా పథకాలు, కార్యక్రమాల అమలుపై ఆర్థికశాఖ ఎప్పటికప్పుడు చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని జోషి కోరారు.