మెదక్

కోమటిచెరువు అభివృద్ధి పనుల జాప్యంపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 19: కోమటిచెరువు మినీ ట్యాంక్ బండ్‌పై జరుగుతున్న అభివృద్ధి పనుల అలసత్వంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోమటిచెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై జరుగతు న్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. రాక గార్డెన్ పనుల జాప్యం మున్సిపల్ అధికారులపై మండి పడ్డారు. ఇంకా ఎన్ని నెల లు పనులు సాగదిస్తారని వారిని ప్రశ్నించారు. అడ్వేంచర్స్ గెమ్స్ చుట్టు మొక్కలు నాటాలని సూచించారు. కోమటిచెరువుపై మొక్కలు, గ్రాస్, ఎండిపోకుండ చూడాలన్నారు. టూరిజం, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సమ్మర్ స్పెషల్..కోమటిచెరువుపై మరిన్ని ఆహ్లాద ఆటలు
కోమటిచెరువు సమ్మర్‌లో మరిన్ని ఆహ్లదకరమైన ఆటలు తీసుకొస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సమ్మర్ స్పెషల్‌లో భాగంగా పిల్లలు ఆడుకునే విధంగా ట్రాంపోలిన్ టైర్లతో ఉండే కట్టపై తిరిగే విధంగా ట్రైన్ కొలంబస్, పిల్లల ఊయ్యాలలు తదితర ఆటలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే అందుబాటులో వచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులను ఆదేశించారు.
* సిద్దిపేట మణిహారం నెక్లెస్ రోడ్డు
సిద్దిపేట మణిహారం కోమటిచెరువు చుట్టు నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డు మంత్రి హరీష్‌రావుఅన్నారు. గురువారం చెరువు చుట్టు నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డు కట్ట పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, సైక్లింగ్ ట్రాక్, బట్టర్ ప్లై లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదిశగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈనెక్లెస్ రోడ్డు సిద్దిపేటకు మణిహారంగా మారబోతుందన్నారు.

నిస్సహాయకులకు చేయూతనిద్దాం
సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 19: నిస్సహాయకులకు మానవతా దృక్పథంతో మనకు చేతనైన సహాయం చేసి చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజాము నుండి కలెక్టర్ సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఎంఎన్‌ఆర్ ఆసుపత్రి పరిసరాలు, బైపాస్‌రోడ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బాలాజీ నర్సింగ్ హోం తదితర ప్రాంతాలలో పర్యటించారు. రోడ్లపై ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా, పెరిగిన జుట్టు, శారీరక పరిశుభ్రత లేక అపరిశుభ్రంగా ఉన్న మతిస్థిమితం లేని, కుటుంబ సభ్యుల నిరాధారణకు గురైన ఎనిమిది మందిని ఆయా ప్రాంతాల్లో గుర్తించి అంబులెన్స్‌లో వారిని జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఇన్‌సిడ్ స్వచ్చంద సేవా సంస్థకు తరలించారు. సంబంధిత మానసిక వికలాంగులకు అక్కడ కటింగ్‌తో పాటు శుభ్రంగా స్నానం చేయించారు. అనంతరం వారికి కొత్త దుస్తులు, దుప్పట్లను కలెక్టర్ అందజేశారు. అల్పహారం తెప్పించి ఇచ్చారు. ఆసుపత్రి వైద్యులు వారికి వైద్య చికిత్సలు చేశారు. సంబంధితులందరిని జాగ్రత్తగా చూసుకోవాలని, మళ్లీ రోడ్లపైకి రాకుండా చూడాలని స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు మనోహర్‌కు సూచించారు. వారికి ప్రతి రోజు సమయానికి అల్పహారం, భోజనం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురారికి సూచించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాలలో నిరాదారణకు గురై, మతిస్థిమితం లేని వారు ఏవరైన కనిపిస్తే వారిని ఇన్‌సిడ్ స్వచ్చంద సేవా సంస్థలో అప్పగించాలని కోరారు. వారికి చేయూతనివ్వడానికి జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాల సహకరిస్తామన్నారు. ప్రతి ఒక్కరు మనవాత దృక్పతంతో ఇలాంటి వారికి చేయూతనిచ్చేందుకు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట సంగారెడ్డి, కంది మండలాల తహసీల్ధార్లు విజయ్‌కుమార్, గోవర్ధన్‌లు ఉన్నారు.