క్రీడాభూమి

32 రాష్ట్రాలు...800 మంది అథ్లెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్, ఏప్రిల్ 19: తమిళనాడు అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో 16వ ఫెడరేషన్ కప్ జూనియర్ జాతీయ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 32 రాష్ట్రాలకు చెందిన 800 అథ్లెటిక్ క్రీడాకారులు పాల్గొననున్నారు. జూన్‌లో జపాన్ గిఫూలో జరుగనున్న 18వ ఆసియా జూనియర్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొనే భారత బాలబాలికల జట్టుకు ఈ చాంపియన్‌షిప్‌లో ప్రతిభకనబరిచిన వారిని ఎంపిక చేయనున్నారు. దీంతో ఈ మీట్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మీట్‌లో 440 మంది బాలురు, 352 మంది బాలికలతో పాటు 100 మంది అధికారులు పాల్గొననున్నారు. చాంపియన్‌షిప్‌లో 16 నుంచి 20 సంవత్సరాల లోపు బాలబాలికల విభాగంలో 44 ఈవెంట్‌లలో పోటీలు జరుగుతాయని ఇక్కడ జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో తమిళనాడు అథ్లెటిక్ సంఘం కార్యదర్శి సి. లత పేర్కొంది. మీట్‌లో ప్రతిభకనబరిచిన అథ్లెట్‌లను జపాన్‌లో జరుగనున్న ఆసియా జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌తో పాటు ఈ సంవత్సరం జరుగునున్న వరల్డ్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయనున్నట్లు ఆమె తెలిపింది. లక్నోలో ఇటీవల ముగిసిన జాతీయ అథ్లెటిక్ మీట్‌లో తమిళనాడు నాలుగో స్థానంలో నిలిచిందని, జాతీయ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రం నుండి మొత్తం 72 మంది బాలబాలికలు పాల్గొంటున్నారని, విరీలో అనేకమంది చక్కటి ప్రతిభను కనపరిచి భారత జట్టులో స్థానం పొందుతారని ఆమె ఆశాభవం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్ర అథ్లెటిక్ సంఘం, కోయంబత్తూర్ జిల్లా అథ్లెటిక్ సంఘం, శ్రీ కృష్ణ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయి.