రాష్ట్రీయం

ఏచూరిదే పైచేయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: సీపీఎం పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో చివరి నిమిషంలో ఏచూరి తన పట్టు నెగ్గించుకున్నారు. పార్టీ 22వ జాతీయ మహాసభల సందర్భంగా అతి కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రకాష్ కారత్ ప్రవేశపెట్టా రు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీని గద్దె దించడమే ప్రధాన అజెండాగా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మాణంపై మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ పాలనకు బ్రేక్‌లు వేసే విషయంలో ఎలాంటి బేధాబిప్రాయాలు లేకున్నా అందుకు అనుసరించాల్సిన విధానాలపై నాయకు ల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పాలనలో మతాన్ని జొప్పించి పాలిస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే ఒంటరిగా సాధ్యం కాదని, కాం గ్రెస్ వంటి జాతీయ పార్టీతో కలిసి నడిస్తేనే ఉత్తమమని ఏచూరి అభిప్రాయ పడగా, ప్రకాష్ కార త్ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తపెట్టుకునేందుకు ససెమెరా అన్నారు. అందుకు పార్టీలోని మెజారిటీ సభ్యులు మద్దతు పలికారు. పార్టీలోని కీలక సభ్యులైన 85మందిలో అత్యధికులు కారత్ వ్య క్తం చేసిన అభిప్రాయాలను సమర్థిస్తూ వచ్చారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నా యకులు సైతం కారత్‌వైపే మొగ్గుచూపారు. దీం తో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరీలోకి దిగాలన్న అభిప్రాయానికి వచ్చారు. అనూహ్యంగా చివరి నిమిషంలో ఏచూరి సూచించిన ప్రతిపాదనలను పరిగణనలోనికి తీసుకొని కాంగ్రెస్‌తో అవగాహన, ఎన్నికల పొత్తులు లేకుండానే అన్న పదాలను తొలగించడంతో భవిష్యత్ లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిం ది. అంతకుముందు సభలో ఏచూరి చేసిన భావోద్వేగ ప్రసంగంతో స్టీరింగ్ కమిటీ ఈ అంశంపై పునరాలోచించుకొని ఈ మేరకు ఆ పదాలను తొలగించినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం సా యంత్రం వరకు నాయకుల మధ్య ఏర్పడ్డ మనస్పర్థాలు సమసి పోయి సయోధ్య కుదిరింది.
మళ్లీ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి..
సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరిగి సీతారాం ఏచూరి కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు ఆయన అభిప్రాయాన్ని మెజారిటీ వర్గీయులు మద్దతు తెలపక పోవడంతో ఏచూరి కొనసాగుతారా? లేదా అనే ఉహాగానాలు తలెత్తాయి. చివరి నిమిషంలో ఏచూరి సూచించి న విధంగా స్టీరింగ్ కమిటీ సవరణలకు ఆమోదం తెలపడంతో ఈ చర్చకు తెరపడినట్టు అయింది.