రాష్ట్రీయం

సచివాలయంలో ఖాళీగా ఉన్న ఏపీ భవనాలను ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: హైదరాబాద్ సచివాలయంలో ఆంధ్రాకు కేటాయించిన సచివాలయ భవనాలను తమకు ఇస్తే ఉపయోగించుకుంటామని, ఈ విషయమై సానుకూలంగా స్పందించాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో ఖాళీగా ఉన్న ఆంధ్ర సచివాలయ భవనాలను తమకు ఇవ్వాలని కోరగా, ఇంతవరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు వినియోగించుకునే హక్కు చట్టరీత్యా ఉండడం, ఈ భవనాలనుతెలంగాణకు అప్పగిస్తే రాజకీయంగా దుమా రం తలెత్తుతుందనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ఉన్న ట్లు సమాచారం. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొ న్న నిబంధనకు అనుగుణంగా ఇక్కడ సచివాలయా న్ని జనాభా నిష్పత్తి 42:58 మేరకు భవనాలను రెండు రాష్ట్రాలకు పంచారు. సచివాలయం మొత్తం 25.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ 9.6 చదరపు అడుగుల స్ధలంలో భవనాలు ఉన్నాయి. ఆంధ్రాకు 15.21 ఎకరాలు కేటాయించగా, 5.31 లక్షల చదరపుఅడుగుల విస్తీర్ణంలో భవనాలను కేటాయించారు. తెలంగాణకు 10.29 ఎకరాలను కేటాయించారు. ఇందులో 3.85 లక్షల చదరపుఅడుగుల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. సచివాలయంలో మొత్తం పది బ్లాక్‌లు ఉన్నాయి. ఇందులో నాలుగు బ్లాక్‌లను తెలంగాణకు, ఐదు బ్లాక్‌లను ఆంధ్రాకు కేటాయించా రు. ఒక బ్లాక్‌లో హెరిటేజ్ నిర్మాణం ఉంది. దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణకు కేటాయించిన ఏ బ్లాక్ 46,500 చదరపు అడుగులు, బీ బ్లాక్ 36,750 చదరపు అడుగులు, సీ బ్లాక్ 55,800 చదరపు అడుగులు, డీ బ్లాక్ 2.46 లక్షల చదరపుఅడుగుల్లో విస్తరించి ఉంది. ఆంధ్రాకు కేటాయించిన హెచ్ సౌత్ బ్లాక్ 59,870 చదరపు అడుగులు, హెచ్ నార్త్‌బ్లాక్ 79,828 చదరపు అడుగులు, జే బ్లాక్ 1.46 లక్షల చదరపు అడుగులు, కె బ్లాక్ 55,427 చదరపు అడుగులు, ఎల్ బ్లాక్ 1.89 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఏపీకి కేటాయించిన బ్లాక్‌ల్లో చాలా మటుకు వినియోగంలో లేవు. ఈ భవనాల మె యింటెనెన్స్ కూడా సరిగా లేదు. విద్యుత్, నీటి బిల్లు లు పేరుకుపోతున్నాయి. కాగా తెలంగాణలో చాలా ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు వెలుపల ఉన్నా యి. ఆంధ్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న బ్లాక్‌లను ఇస్తే, వీటిల్లోకి తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలను మా ర్చవచ్చనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.