రాష్ట్రీయం

ధర్మ పోరాట దీక్ష సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు కో సం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంట ల వరకు చేపట్టిన ధర్మపోరాట దీక్ష అంచనాలకు మంచి విజయవంతమైంది. ఒక్క కృష్ణాజిల్లా నుం చే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్య లో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. సభ ముగిసేవరకు ప్రాంగణం నుంచి వెళ్లేవారు వెళుతుండగా వచ్చేవారు వస్తూనే ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంతగా వేలాది మంది ప్రజానీకంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ముందు జాగ్రత్త చర్యగా రహదారులపై ట్రాఫిక్ మళ్లింపు జరిగిం ది. ప్రజల తరలింపుకోసం పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగించటంతో అనేక రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ మళ్లింపు వల్ల కూడా ప్రజలు అనేక అవస్థలు ప డ్డారు. ఇక బీజేపీతో పాటు ప్రతిపక్ష వైకాపా, వా మపక్షాలు, జనసేన, పార్టీలు బాబు దీక్షను బహిష్కరించాయి. అయితే అనేక ప్రజా సంఘాలు, ప్రధానంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు విద్యార్థి, యువజన కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జర్నలిస్టు సంఘా లు కూడా బాబు దీక్షకు మద్దతు తెలిపాయి. చిత్రపరిశ్రమ ప్రముఖులు రాఘవేంద్రరావు, అశ్వనీద త్, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీతో పాటు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవాడలోని ప్రధాన రహదారుల న్నీ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూ డా బాబు దీక్షకు వచ్చే పోయేవారితో కిటకిటలాడాయి. బాబు దీక్ష విజయవంతం కావడంతో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.