జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: యువతను తీవ్రవాదం వైపువెళ్లకుండా చూడడం, ఇప్పటికే ఆ ఉచ్చులో ఉన్న వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం ద్వారా జమ్మూకాశ్మీర్ శాంతిని పాదుగొల్పవచ్చని సైన్యం స్పష్టం చేసింది. దీని కోసం సమష్టికృషి జరగాలని అప్పుడే హింసను పారదోలి, తుపాకీ సంస్కృతి రూపుమాపవచ్చని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆర్మీ కమాండర్ల ద్వైవార్షిక సమావేశాల్లో కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో నవ యువత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవుతున్నట్టు సంచలన కథనాల నేపథ్యంలో జరుగుతున్న సైనికాధికారుల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.‘ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను మరింతగా చేపట్టడం ద్వారా హింసను సాధ్యమైనంత వరకూ తగ్గించవచ్చు. దీనికి సమష్టి కృషి ఎంతో అవసరం. యువతను మిలిటెన్సీ నుంచి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. తుపాకీ సంస్కృతిని తుదముట్టించడం ద్వారా కాశ్మీర్‌లో శాంతి స్థాపన జరుగుతుంది’అని డైరెక్టర్ జనరల్ (స్ట్ఫా డ్యూటీస్) లెఫ్టినెంట్ జనరల్ ఏకే శర్మ స్పష్టం చేశారు. నగ్రోటా బేస్డ్ 16వ స్థావరానికి అధిపతిగా శర్మ పనిచేశారు. కాశ్మీర్ లోయలో యువత ఐఎస్ ఉచ్చులోపడకుండా సైన్యం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందీ మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. యువతను తీవ్రవాదం నుంచి బయటకు తీసుకురావడం ద్వారానే కాశ్మీర్‌లో శాంతిని స్థాపించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. వేసవికి ముందే ఈ మూడున్నర నెలల కాలంలో వందలాది మంది మిలిటెంట్లు, పౌరులు మరణించారు.
మరోపక్క డజన్లకొద్దీ యువత హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల్లో చేరినట్టు తాజా నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరుడుగట్టిన ఈ మూడు ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నాయి. జమ్మూకాశ్మీర్‌ను పాకిస్తాన్‌లోకలపాలన్న డిమండ్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తూ రాష్ట్రంలో విధ్వంసక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ కూడా కాశ్మీర్‌లో హింసను ప్రోత్సహిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా స్థానిక యువతో సంబంధాలు నెరపుతూ వారిని ఆకట్టుకుంటున్నట్టు తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతే తప్ప భౌతికంగా ఐఎస్ కార్యకలాపాలకు సంబంధించి స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. కాగా సోమవారం ప్రారంభమైన సైనిక కమాండర్ల ద్వైవార్షిక సమావేశాలు శనివారంతో ముగుస్తాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోని తాజా పరిస్థితులపైనా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. చొరబాట్లు, కాల్పుల ఘటనలను తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు లెఫ్టినెంట్ జనరల్ శర్మ వెల్లడించారు. దళాల ఆధునీకరణ, బడ్టెట్ కేటాయింపులపైనా చర్చ సాగింది. ఆఖరి రోజు మిలటరీ ఆపరేషన్స్‌కు సంబంధించే ప్రత్యేకంగా చర్చించనున్నట్టు ఆయన తెలిపారు.