రాష్ట్రీయం

హైటెక్ బాటలో ఓపెన్ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: అంబేద్కర్ ఓపెన్ వర్శిటీని హైటెక్ బాటలోకి తీసుకువెళ్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొ. కే సీతారామారావు తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం లో వైస్ ఛాన్సలర్ ప్రొ. కే సీతారామారావు మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో మరో 10 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సీతారామారావు తెలిపారు. ఇప్పటికే 10 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు ఉన్నాయని, కొత్త జిల్లాల్లో వసతులు, వనరులు పరిశీలించిన మీదట అదనంగా మరో పది కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను, అధ్యయన కేంద్రాలను బలోపేతం చేసేందుకు విశ్వవిద్యాలయంతో అనుసంథానం చేస్తూ నెట్ వర్కు ఏర్పాటు చేస్తామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 23 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలతో కలిపి మొత్తం 215 అధ్యయన కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ప్రత్యేకంగా బిఇడీ ప్రోగ్రాం కోసం 10 కేంద్రాలు, బిఇడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం 11 కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది రీసెర్చి ప్రోగ్రాం అడ్మిషన్ల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వీసీ చెప్పారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ప్రమాణాలు లోపించకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని అన్నారు. స్నాతకోత్సవంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎంఫిల్, పిహెచ్‌డి పట్టాలతో పాటు బంగారు పతకాలు, బుక్ ప్రైజ్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ వీసీ ఆచార్య ఎన్ వి వర్గీస్ స్నాతకోపన్యాసం చేశారు. 34,387 మందికి డిగ్రీలు అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఐదుగురికి ఎంఫిల్, పిహెచ్‌డి పట్టాలు , 36 మంది విద్యార్థులు బంగారు పతకాలు ఇచ్చారు. 13 మంది డిగ్రీ, 23 మంది పీజీ చేసిన వారున్నారు. ప్రతిభ చూపిన మరో నలుగురు విద్యార్థులకు బుక్ ప్రైజ్ ఇచ్చారు. స్నాతకోత్సవం సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ఐదు కేంద్ర కారాగారాల్లో 106 మంది ఖైదీలు డిగ్రీ , పీజీలు సర్ట్ఫికేట్లు ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు అనంతసాగర్ భారతి విశే్వశ్వరరెడ్డి మెమోరియల్ బుక్ ప్రైజ్ సాధించారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటయ్య, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.